స్మార్ట్ ఫోన్ నేటి మనుషుల జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పుకోవచ్చు.చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు దానికి అడిక్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో ఆఖరికి పిల్లలను మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు( Teachers ) కూడా అదే మాదిరిగా తయారయితే ఇక ఈ జెనరేషన్ పిల్లల గతి యేమవుతుంది? ఇపుడు అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.అవును, యూపీకి( Uttar Pradesh ) చెందిన ఉపాధ్యాయులు కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతూ, రీల్స్ చేస్తూ ఆ తరువాత పిల్లల్ని లైకులు, షేర్లు కొట్టమని బలవంతం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా ఈ తంతు కాస్త విద్యార్ధులు( Students ) తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వార్త వెలుగులోకి వచ్చింది.ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను లైక్, షేర్ మరియు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో సదరు టీచర్స్ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ని ఆశ్రయించగా ఈ విషయం స్థానికంగా పెను సంచలంగా మారింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని కొంతమంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) వారు చేసిన పోస్టులకు లైక్ మరియు షేర్ చేయమని అంతేకాకుండా వారి ఖాతాలను సబ్‌స్క్రయిబ్ చేయమని కూడా బలవంతం చేశారు.ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆ టీచర్లలో రోజుకి ఒకరు స్కూల్‌లో షూట్ చేస్తూ వూంటారు.కాగా ఇదే విషయమై పాఠశాలలో విధుల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టిస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు.దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వరి ఆర్తి గుప్తా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.