కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశాల్( Vishal ) ఒకరు.ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడుగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విశాల్ ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఆయన మార్క్ ఆంటోనీ ( Mark Antony ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయాలని విశాల్ భావించారట.ఈ క్రమంలోనే తన సినిమాని హిందీలో విడుదల చేయడం కోసం ముంబై సెన్సార్ బోర్డుకు పంపించారు.అయితే సెన్సార్ బోర్డు( Censor Board ) వాళ్ళు ఈ సినిమాకి సెన్సార్ చేయాలి అంటే లంచం కావాలి అని అడిగారు అంటూ విశాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులు తన నుంచి ఆరు లక్షల రూపాయల లంచం అడిగి తీసుకున్నారు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈ విషయాన్ని ఈయన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ తాను లంచం( Bribe ) ఇచ్చినట్టు చెప్పడమే కాకుండా అందుకు సంబంధించిన అకౌంట్ ని కూడా ఈ వీడియోలో రూపొందించారు.సినిమాలలో అవినీతి చూపించడం జరుగుతుంది కాని సినిమాను విడుదల చేయాలి అంటే ఇలా అవినీతి చేయాల్సి వస్తుందని తాను అనుకోలేదు ఇలా నా సినిమా కోసం నేను లంచం ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.హిందీ వెర్షన్ కోసం తాను దాదాపు 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.ఒకటి స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు రెండు సర్టిఫికెట్ కోసం మరో మూడున్నర లక్ష రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.