పంజాబ్‌లోని( Punjab ) ఒక పోలీసు అధికారి ఓ లేడీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈ ఆఫీసర్ ఆమెకు తన డ్యూటీ వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతించారు.
దాంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను రూపొందించడానికి ఆ వాహనాన్ని వాడింది.ఈ రీల్స్ వైరల్ అయింది.
ఇది ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు ఈ పోలీసును సస్పెండ్ చేశారు.ఈ ఘటనపై సదరు అధికారిని వివరణ ఇవ్వమని కూడా కోరారు.
వీడియోలో, ఇన్‌ఫ్లుయెన్సర్ పోలీసు కారు( Police Car ) బానెట్‌పై పోజులిచ్చి ఫోటోలు దిగుతున్నట్లు కనిపిస్తుంది.వీడియో చివర్లో ఆమెతో పాటు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి కూడా కనిపిస్తారు.

ఆ పోలీస్ కారు ఠాణా డివిజన్ నాలుగులోని స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)కి చెందినది.జలంధర్ పోలీసులు,( Jalandhar Police ) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఒక అమ్మాయి పోలీసు కారును ఉపయోగిస్తున్న వీడియోపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ఆగ్రహాన్ని కలిగించింది.అమ్మాయి కారును ఏమని చెప్పి ఉపయోగించింది, దీనిని ఆమెకు ఇప్పించడంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాత్రను ఏంటి? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనకు కుమార్ బాధ్యుడని, విచారణకు రావాలని కోరారు.ఆ వీడియోపై యువతి క్షమాపణలు కూడా చెప్పింది.తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కారుపై కూర్చున్నామని చెప్పింది.వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) పోస్ట్ చేయాలని భావించానని కానీ అది ఇంత పెద్ద సమస్యగా మారుతుందని తాను గ్రహించలేదని తెలిపింది.
ఇది పొరపాటున అప్‌లోడ్ చేశామని, ప్రజలు దానిని వైరల్ చేశారని చెప్పింది.వీడియో వైరల్ అయినందుకు క్షమాపణలు చెప్పింది.కేవలం సరదా కోసమే పోస్ట్ చేశామని, ప్రజలు దాన్ని తప్పుగా తీసుకుంటున్నారని అన్నది.







