వరల్డ్స్ 50 బెస్ట్ హోటల్స్ జాబితా తాజాగా రిలీజ్ అయింది.ఇందులో ఆగ్రాలోని ఒబెరాయ్ అమరవిలాస్ హోటల్ ( Oberoi Amaravilas Hotel in Agra )స్థానం దక్కించుకోవడం విశేషం.
తాజ్‌మహల్‌కి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ హోటల్‌ని చూసినవారు జీవితంలో మర్చిపోలేరు.ఈ హోటల్ విశేషాలు అలాంటివి మరి.చుట్టూ తోటల మధ్య కొలువైన ఈ హోటల్ ని చూడడానికి ప్రతియేటా అనేకమంది పర్యటకులు వెళుతూ వుంటారు.ఇక ఇందులోని రూమ్స్, ఫర్నీచర్‌ని చూస్తే దిమ్మ తిరగాల్సిందే.
కాగా లండన్‌లో( London ) జరిగిన అవార్డుల వేడుకలో ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటళ్ల జాబితాలో ఒబెరారు అమరవిలాస్ 45వ స్థానంలో నిలిచింది.ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాల్లోని 35 వేర్వేరు ప్రదేశాల నుండి విలాసవంతమైన హోటళ్లను పరిశీలించి ఈ జాబితాలో చేర్చడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ హోటల్‌కి సంబంధించిన విశేషాలను అమర్‌విలాస్ హోటల్ ( Amarvilas Hotel )ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.ఒబెరాయ్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా హోటళ్లను కలిగి వుంది.దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోకలదు.5 దేశాల్లో 20కి పైగా హోటళ్లు, 2 క్రూయిజర్లను ఒబెరాయ్ సంస్థ సొంతగా నిర్వహిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక అవార్డులు అందుకున్న ఒబెరాయ్ గ్రుపు హోటళ్లలో ఇది ఒకటి.1934 సంవత్సరానికి మునుపు దీని వ్యవస్థాపక అధ్యక్షుడైన రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్( Rai Bahadur ,Mohan Singh Oberoi ) ఓ ఆంగ్లేయుని నుంచి ఢిల్లీలోని క్లార్క్స్ హోటల్, సిమ్లాలోని క్లార్క్స్ హోటల్ కొనుగోలు చేయడం జరిగింది.ఆ తర్వాత సంవత్సరాల్లో మొహన్ సింగ్ ఒబెరాయ్ తన ఇద్దరు కుమారులైన తిలక్ రాజ్ సింగ్ ఒబెరాయ్, పృథ్విరాజ్ ఒబెరాయ్ లకు సలహాలిస్తూ హోటళ్ల విస్తరణకు సహకరించారు.
ప్రస్తుతం ఒబెరాయ్ గ్రూపునకు ఛైర్మన్ గా ఉన్న పి.ఆర్.ఎస్.ఒబెరాయ్,( PRS Oberoi ) అతని కొడుకు విక్రమ్ ఒబెరాయ్, అతని మేనళ్లుడు అర్జున్ ఒబెరాయ్ లు సంయుక్తంగా అనుబంధ హోటళ్లకు మేనేజింగ్ డైరెక్టర్లుగా సేవలందిస్తున్నారు.ట్రైడెంట్ పేరుతో భారత్, సౌదీ అరేబియాలో కూడా ఒబెరాయ్ గ్రూపు హోటళ్లను నిర్వహిస్తోంది.
యు.ఎస్.ఎ.లోని కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ఆసియాలోని మొదటి 15 రిసార్ట్స్ ల జాబితాలోఒబెరాయ్ వన్య విలాస్ కు స్థానం లభించింది.ఒబెరాయ్ అమర్ విలాస్, ఆగ్రా ప్రపంచంలో ఐదో ఉత్తమ హోటల్ గా, ఒబెరాయ్ రాజ్ విలాస్, జైపూర్ 13వ ఉత్తమ హోటల్ గా, ఒబెరాయ్ ఉదయ్ విలాస్, ఉదయ్ పూర్ ప్రపంచ 4వ ఉత్తమ హోటల్ ర్యాంకు దక్కడం విశేషం.