మల్లెమాలలో ప్రసారం అయిన జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా చాలామంది కమెడియన్లు పాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే.అందులో సుడిగాలి సుధీర్ ఒకరు… ఇక సుడిగాలి సుధీర్ గురించి చెప్పుకోవాలి అంటే ఆయన జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఆయన లక్ అనేది చేంజ్ అయిందనే చెప్పాలి.
జబర్దస్త్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత చాలా టాప్ పొజిషన్ కి వెళ్ళాడు.ప్రస్తుతం ఇప్పుడు సినిమాల్లో కూడా హీరోగా నటిస్తున్నాడు.
అందులో భాగంగానే గాలోడు,( Gaalodu Movie ) సాఫ్ట్ వేర్ సుధీర్ లాంటి సినిమాలతో మన ముందుకు వచ్చాడు.

ఈ సినిమాల్లో గాలోడు మంచి విజయాన్ని అందుకోగా, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ( Software Sudheer )మాత్రం ఫ్లాప్ అయింది.ఇక ప్రస్తుతం ఆయన ఒక మంచి సబ్జెక్టుతో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే ఆయన వెల్లడిస్తున్నట్టుగా చెప్తున్నారు.
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ సైతం సుదీర్ తో సినిమా చేయడానికి పోటీపడుతున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ ఆంటోనీ( Vijay Antony )తో బిచ్చగాడు సినిమా తీసి సక్సెస్ అయిన డైరెక్టర్ శశి( Director Sasi ) కూడా సుధీర్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇప్పటికే సుదీర్ ని కలిసి కథ కూడా చెప్పినట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కామెడీతో పాటు సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు కానీ ఈ సినిమా మాత్రం పక్కాగా ఉంటుందని సుధీర్ సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం సుధీర్ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి అయిన వెంటనే శశి తో ఈ సినిమా ఉంటుందని ఆయన ఇప్పటికే డైరెక్టర్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది.ఒక టీవీ షో లో పాపులర్ అయిన సుధీర్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ప్రస్తుతం సుధీర్ సినిమాలకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది.
అందుకే టీవీ షో లో కూడా ఎక్కువగా కనిపించకుండా తన టైం మొత్తాన్ని సినిమాల పైన కేటాయించినట్టుగా తెలుస్తుంది…
.