ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాల ( Telangana Politics ) కు చాలా తేడాలు ఉంటాయి.ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉంటారు.
కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితులు ఉండవు.ఇక్కడ వ్యక్తులను బట్టి గెలుపోటములనేవి ఉంటాయి.
ఇంకా కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి అన్ని పార్టీల్లో కొనసాగుతోంది.ఇప్పటికే అధికార బిఆర్ఎస్ (BRS) పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్తోంది.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ మంత్రులంతా మరోసారి తెలంగాణలో బిఆర్ఎస్ జండా ఎగరబోతోందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
గత రెండు పర్యాయాలు కెసిఆర్( KCR ) నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయ దుందుభి ఎగరవేసింది.కానీ ఈ ఎన్నికల్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వచ్చిందని చెప్పవచ్చు.దీనికి ప్రధాన కారణం నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వంపై విపరీతంగా అసహనంతో ఉన్నారు.
ఇదే తరుణంలో ఈ మైనస్ ను ఉపయోగించుకోవాల్సినటువంటి బిజెపి,కాంగ్రెస్ పార్టీలు విఫలం అవుతున్నాయని చెప్పవచ్చు.అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్( Bandi Sanjay ) ఉన్న సమయంలో బిఆర్ఎస్ కు పోటీ ఇచ్చేది బిజెపి అని అందరూ అనుకున్నారు.
కానీ బండి సంజయ్ అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత బిజెపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి( Revanth reddy ) వచ్చారు.
దీంతో కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది.అలాగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, రాహుల్ భారత్ జోడో యాత్ర ఇలా కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా రకరకాల వ్యూహాల వల్ల ప్రజలలో కాంగ్రెస్ మైలేజీ పెరిగింది అని చెప్పవచ్చు.
ప్రజలు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు.
కానీ ఆ ఓట్లను పూర్తిస్థాయిలో పొందే శక్తి కాంగ్రెస్ నాయకుల ( Congress leaders ) మధ్య కనిపించడం లేదు.రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రతిసారి గొడవలే జరుగుతున్నాయి.ప్రతి నియోజకవర్గం నుంచి రెండు నుంచి మూడు ఎమ్మెల్యే దరఖాస్తులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి అందించారు.
ఇందులో నుంచి ప్రజల్లో ఎక్కువ పేరున్న అభ్యర్థులకు టికెట్లు వస్తాయని స్క్రీనింగ్ కమిటీ తెలియజేస్తోంది.దీంతో చాలా నియోజకవర్గాల్లో టికెట్ నాకు వస్తుంది అంటే నాకు వస్తుంది అంటూ అభ్యర్థుల మధ్య గొడవలు రావడంతో గ్రూపులు ఏర్పడ్డాయి.
దీనివల్ల ప్రజలు కూడా నాయకుల మధ్య సఖ్యత లేదు పాలన ఏ విధంగా చేస్తారు అంటూ కాస్త విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ విచారమే మళ్లీ బిఆర్ఎస్ ( BRS ) వైపు మళ్లేలా కాంగ్రెస్ నాయకులే చేసుకుంటున్నారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.