Anchor Ravi : అషుతో యాంకర్ రవి.. డ్రగ్స్ దానిని వెనకేసుకుని తిరుగుతున్నావన్న నేటిజన్… రవి రియాక్షన్ ఇదే!

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అషు రెడ్డి ( Ashu Reddy )ఒకరు.ఈమె టిక్ టాక్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యారు అనంతరం సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్ ల ద్వారా గుర్తింపు పొందారు ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి రెండుసార్లు కంటెస్టెంట్గా వెళ్లినటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Netizen Shocking Comments On Anchor Ravi And Ashu Reddy-TeluguStop.com

ఇక ప్రస్తుతం అషు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారంలో ఈమె పేరు మారుమోగిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా యాంకర్ రవి( Anchor Ravi ).అషు రెడ్డితోపాటు అరియానతో ( Ariyana )కలిసి ఓ రీల్ వీడియో చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఈ ముగ్గురు కలిసి ఎంతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.అయితే ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఒక నెటిజన్ అషు రెడ్డిని ఉద్దేశిస్తూ.డ్రగ్స్ దానిని వెనకేసుకొని తిరుగుతున్నావా అంటూ కామెంట్ చేశారు.

ఇలా నేటిజన్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్ కాస్త సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.ఇక దీనిపై రవి స్పందిస్తూ సదరు నెటిజన్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.

ఈ కామెంట్ పై రవి స్పందిస్తూ… నువ్వు చూసావా రా తను తీసుకోవడం నీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సెట్ చేసుకో ఫస్ట్.వీలైతే మంచి మాటలతో ఒకరికి సంతోషం పంచు లేకపోతే అన్ని మూసుకొని ఒక మూలన కూర్చో అంటూ రవి గాటుగా రిప్లై ఇచ్చారు.

ఇలా రవి రియాక్ట్ అవ్వడమే కాకుండా ఈ కామెంట్ డిలీట్( Comment Delete ) చేసిన నేను దీనిని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నానని నువ్వు డిలీట్ చేసిన నేను ఈ స్క్రీన్ షాట్ స్టోరీగా పెట్టి నిన్ను మరింత ఫేమస్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా రవి సదురు నెటిజన్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే గత కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో భాగంగా అషూ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది దీంతో ఆమె ఈ ఘటన పై రియాక్ట్ అవుతూ కొందరు ఉద్దేశపూర్వకంగానే నా పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారని ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అంటూ చెప్పకనే చెప్పేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube