భారత్ ని ఆకాశానికేత్తేసిన ఇజ్రాయిల్ ప్రధాని... ఏమన్నారంటే?

ప్రపంచ దేశాలు భారత్( Bharat ) వైపు చూస్తున్న వేళ తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ( Israel PM Benjamin Netanyahu ) మనదేశాన్ని కొనియాడారు.చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్( India-Middle East-Europe Corridor ) వేదికగా ఆయన ఈ ప్రశంసలు కురిపించారు.ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని, దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.జీ20 సమావేశాల్లో( G20 Summit ) శనివారం అమెరికా, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించిన సంగతి విదితమే.

 Project Connecting India To Europe Via Middle East Largest Cooperation Project I-TeluguStop.com
Telugu America, Beltroad, China, Eastern, Summit, India, Indiamiddle, Israel, Pr

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది.ఆసియా నుంచి యూరప్ వరకు మౌళిక సదుపాయాలను విస్తరించే దిశగా ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు అడుగులు వేస్తుందని అన్నారు.ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహూ ఓ వీడియో సందేశంలో తెలిపారు.మిడిల్ ఈస్ట్,( Middle East ) ఇజ్రాయిల్( Israel ) ముఖచిత్రాన్ని ఈ ప్రాజెక్టు పూర్తిగా మార్చివేస్తుందని కూడా అన్నారు.

భారతదేశం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు అరబ్, గల్ఫ్ దేశాలను, యూరోపియన్ దేశాలతో కలుపుతుందని నెతన్యాహూ అన్నారు.

Telugu America, Beltroad, China, Eastern, Summit, India, Indiamiddle, Israel, Pr

కాగా ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన యూఎస్ఏకి( USA ) నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు.డ్రాగన్ కంట్రీ చేపట్టిని ఈ ప్రాజెక్టు చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందనే వాదనలు లేకపోలేదు.ప్రపంచ తయారీ దిగ్గజంగా ఉన్న చైనా( China ) తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు భూ, సముద్రమార్గాల నెట్వర్క్ ద్వారా ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఆఫ్రికా, యూరప్ ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో జిన్ పింగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చాడు.

అయితే ఈ ప్రాజెక్టు అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఇటలీ ఇందులోనుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube