అక్కడికి కూడా మేకప్ వేసుకొని వెళ్లారా?... సురేష్ కొండేటి పై బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!

సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి(Suresh Kondeti) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సంతోషం వార్తాపత్రిక ఎడిటర్ అయినప్పటికీ ఈ విషయం గురించి చాలామందికి తెలియదు.

 Actor Brahmaji React On Film Journalist Suresh Kondeti Tweet Details, Suresh Kon-TeluguStop.com

అయితే ఈయన సెలబ్రిటీలు ప్రెస్ మీట్ లో నిర్వహించిన సమయంలో చాలా డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.ఇలా సురేష్ కొండేటి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను టచ్ చేస్తూ ప్రశ్నలు అడగడంతో ఈయన పట్ల చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా సురేష్ కొండేటి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బ్లూ కలర్ టీషర్ట్ ట్రాక్ ప్యాంటు ధరించి జిమ్ లో( Gym ) వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి సురేష్ Today is My Gym workout Pics’ అని క్యాప్షన్ పెట్టారు.దీంతో ఇదేం ఇంగ్లిష్ అంటూ కొందరు ఎగతాళి చేస్తున్నారు.

అయితే ఈ ఫోటో పై స్పందించినటువంటి కొందరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈయన షేర్ చేసిన ఈ ఫోటోపై నటుడు కమెడియన్ బ్రహ్మాజీ (Brahmaji) కూడా స్పందించారు.

ఈ సందర్భంగా బ్రహ్మాజీ ఈ ఫోటో పై షేర్ చేస్తూ మీరు జిమ్ కి కూడా మేకప్( Makeup ) వేసుకొని వెళ్లారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన రిప్లై ఇస్తూ నేను మేకప్ వేసుకోలేదని తన రియల్ ఫేస్ అంటూ కామెంట్ కి రిప్లై ఇచ్చారు.దీంతో మరోసారి బ్రహ్మాజీ తనకు రిప్లై ఇస్తూ జిఫ్ ఇమేజ్ షేర్ చేశారు.ఈ జిఫ్ ఇమేజ్‌లో బ్రహ్మాజీ చాలా సీరియస్‌గా థింక్ చేస్తున్నట్టు ఉంది.దీంతో చాలామంది ప్రేక్షకులు బ్రహ్మాజీకి సపోర్ట్ చేస్తూ సురేష్ కొండేటిపై ట్రోల్స్ చేయగా మరికొందరు మాత్రం ఆయనను ఎంకరేజ్ చేస్తూ హీరోగా ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube