బిజెపి మహిళా బిల్లును ప్రయోగించబోతుందా?

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న బిల్లు గత 25 సంవత్సరాలుగా పార్లమెంట్ లో మగ్గిపోతుంది.అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ బిల్లుకి మోక్షం మాత్రం కలగడం లేదు .

 Will Bjp Introduce The Women's Bill, Womens Bill , Bjp, Congress Party , Polit-TeluguStop.com

పార్టీలకి చిత్తశుద్ధి లేకపోవడం ఒక కారణం అయితే దీనిపై బలం గా పోరాడే స్పూర్తి కూడా మహిళా లోకం లో కనిపించక పోవడం మరో కారణం .అయితే ఎట్ట కెలకు ఈ బిల్లు కి మోక్షం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి .2024 ఎన్నికల( 2024 elections ) కి ఒక బలమైన ప్రచార అస్త్రం కోసం వెతుకుతున్న బజాపా ఇప్పుడు మహిళా బిల్లుని భుజానికి ఎత్తుకోబోతున్నట్టుగా తెలుస్తుంది .ఇప్పటి వరకూ నామమాత్రంగా మహిళలకు సీట్లను కేటాయిస్తూనే అన్ని పార్టీలు బండ్లు లాగిస్తున్నాయి.నిజానికి ఆయా స్థానాలలో కూడా పేరుకు మహిళా అభ్యర్థులను నిలబెట్టి తెర వెనుక వారి తండ్రి లేదా బర్త చక్రం తిప్పుతున్న వాతావరణం భారత దేశ మంతా కనిపిస్తుంది.

Telugu Congress, Narendra Modi, Rahul Gandhi, Samajwadi-Telugu Political News

అయితే వచ్చే ఎన్నికలకు ప్రధాన ఎన్నికల అస్త్రంగా మహిళా బిల్లును భాజా( BJP )పా ప్రయోగించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా దేశ జనాభాల్లో సగం ఉన్న మహిళలను ఈ బిల్ పాస్ చేయడం ద్వారా ఆకట్టుకోవచ్చని, ఇది చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని భాజపా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న ఇండియా కూటమి కి కూడా మహిళా అభ్యర్థులను ఇంత తక్కువ సమయంలో పోటీకి నిలపడం కూడా కష్ట సాధ్యమవుతుందని, అంతేకాకుండా దేశ రాజకీయాల్లో క్రియాశీలక మార్పు తెచ్చిన పార్టీగా తాము ప్రచారం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుందని బాజాపా లెక్కలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Narendra Modi, Rahul Gandhi, Samajwadi-Telugu Political News

అయితే ఈ బిల్లుకి మోక్షం వస్తే మాత్రం దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చూడొచ్చని చెప్పొచ్చు .543 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న భారత్లో 180 కి పైగా అప్పుడు మహిళ ఎంపి లు కనిపిస్తారు .దాంతో భారత ప్రజాస్వామ్యంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని దేశ సర్వతో ముఖాభి వృద్ది కి కూడా ఇది ఉపయోగపడుతుందంటూ కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇంతకుముందు ఈ బిల్లు పార్లమెంట్కు వచ్చినప్పుడు సమాజ్ వాదీ పార్టీ ,ఆర్జెడి వంటి పార్టీలు( Samajwadi Party ) వ్యతిరేకించాయి .అయితే మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయా పార్టీల స్టాండ్ ఏమిటో కూడా తెలియాల్సి ఉంది .అయితే తమకున్న బలంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును పాస్ చేయించుకోగలిగే భాజపా దాని ఫలితాలను పొందగలుగుతుందో లేదో మాత్రం చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube