విదేశాల్లో తుపాకీలు( Guns ) మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.ఈ ఘటనలు ఎక్కువైపోతున్నా అక్కడ మాత్రం గన్ సేల్స్ తగ్గడం లేదు.
ఆత్మ రక్షణలో భాగంగా తుపాకీలను ఎవరైనా సరే కొనుగోలు చేయొచ్చనే రూల్స్ కూడా చాలా విమర్శల పాలవుతున్నాయి.క్రమంలోనే తాజాగా అమెరికా దేశం,( America ) ఇండియానా రాష్ట్రం, గ్యారీ సిటీలో ఓ విషాదం చోటు చేసుకుంది.5 ఏళ్ల బాలుడు తన కేర్‌టేకర్( Caretaker ) చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని అనంతరం దానితో కాల్చుకుని చనిపోయాడు.
వివరాల్లోకి వెళితే, కేర్‌టేకర్ బుధవారం రాత్రి నిద్రలోకి జారుకున్నాడు.
ఆ సమయంలో తుపాకీని టేబుల్‌పై ఉంచాడు.నిద్ర లేచి చూసే సరికి బాలుడు( Boy ) శవమై కనిపించాడు.32 ఏళ్ల కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా అభియోగాలు నమోదు చేయలేదు.ఈ ఘటనపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతూ ప్రజల సహాయాన్ని కోరుతున్నారు.
మృతి చెందిన అబ్బాయి తల్లిదండ్రులు ఇటీవల బయటికి వెళ్లారు.ఆ సమయంలో ఆ బాలుడితోపాటు 17 ఏళ్ల అమ్మాయిని సురక్షితంగా చూడాలంటూ ఓ కేర్‌టేకర్‌ను పిలిచారు.అదే విషయాన్ని సదరు కేర్ టేకర్ పోలీసులకు చెప్పాడు.తాను సోఫాలో నిద్రపోయానని, ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకున్న సంగతి తనకు తెలియదని చెప్పాడు.గన్ షాట్ ( Gun Shoot ) ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇంకేదైనా జరిగిందా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనపై ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే ముందుకు రావాలని కోరుతున్నారు.ఈ ఘటనలో కేర్‌టేకర్ తప్పు ఉందో లేదో ఇంకా నిర్ధారించలేదు కాబట్టి అతని పేరును వెల్లడించలేదు.బాలుడి పేరు కూడా వెల్లడించలేదు.
ఈ దుర్ఘటన తల్లిదండ్రుల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది.