గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముద్దు ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.ఈ విషయంపై అనేక రకాల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
అంతేకాకుండా చిన్నపాటి వివాదాలు కూడా రేపిన విషయం మనందరికీ తెలిసిందే.ఒక ప్రెస్ మీట్ లో దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి( AS Ravikumar Choudary ) హీరోయిన్ మన్నారా ను( Heroine Mannara ) ముద్దాడిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ ఫోటోలు వీడియోలలో హీరోయిన్ మన్నారా చోప్రాను రవికుమార్ బుజాలపై ఆప్యాయంగా చెయ్యి వేసి బుగ్గపై ముద్దు పెట్టాడు.
అయితే దర్శకుడు ఒక్కసారిగా ఆ పని చేసేసరికి మన్నారా షాక్ అయింది.తర్వాత వెంటనే తేరుకొని నవ్వేసింది.అయితే ప్రెస్ మీట్ లో మీడియా ముందే దర్శకుడు చేసిన ఈ పనిపై విమర్శలు చెలరేగాయి.ఆ వెంటనే దర్శకుడు తన చేసిన పనిపై స్పందించాడు.మన్నారాను( Mannara ) ముద్దుపెట్టుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించాడు.ఆప్యాయతతో అలా చేశానని, తన కూతుర్ని కూడా అలానే ముద్దు పెట్టుకుంటానని అన్నాడు.
అయినా సదరు హీరోయిన్ కు లేని ప్రాబ్లమ్ మీడియాకు ఎందుకంటూ ఫైర్ అవ్వడంతో పాటు మీడియాను నిలదీశారు.కాగా ఇప్పుడు ఈ వ్యవహారంపై మన్నారా కూడా స్పందించింది.
డైరక్టర్ చేసిన పనిని సమర్థించింది.
ఆయన తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు.మొదటి నుంచి ఏఎస్ రవికుమార్, నన్ను బేటీ బేటీ అని సంబోధిస్తున్నారు.అదే ఆప్యాయతతో ఆరోజు అలా బుగ్గపై ముద్దుపెట్టి ఉంటారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది మన్నారా.
డైరక్టర్ పెట్టిన ముద్దులో తనకు తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.అలా మీడియా మందు ముద్దుపెట్టేసరికి కాస్త కంగారు పడ్డానే తప్ప, ఆయన ముద్దులో తనకు పెడార్థాలు కనిపించలేదని చెప్పుకొచ్చింది.