తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వస్తున్న కాలం !

విజయం రాసిపెట్టి ఉన్నప్పుడు కాలం కలిసి వస్తుంది అన్న సామెతకు తగ్గట్టుగా తెలంగాణ కాంగ్రెస్కు( Telangana Congress ) అన్ని శుభశకునాలు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులు ఎంపికలో చేసిన కొన్ని తప్పులను చాకచక్యంగా అందిపుచ్చుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతుంది.

 Good Time Statrted For Telangana Congress Party Tummala Ponguleti Sharmila Detai-TeluguStop.com

బరాశా( BRS ) అభ్యర్థుల ఎంపికకు ముందే కొంతమంది కీలక నేతలు ఆకర్షించగలగిన కాంగ్రెస్ ,అభ్యర్థుల ప్రకటన తర్వాత సీటు దక్కించుకో లేకపోయిన కొంతమంది అసంతృప్త నేతలను తమ పార్టీలోకి విజయవంతంగా చేర్చుకుంటుంది

ఇప్పుడు ఆ లిస్టులో ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల( Tummala Nageswara Rao ) కూడా చేరినట్లుగా తెలుస్తుంది.జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే క్రియాశీలక నేతగా పేరు ఉన్న తుమ్మల కాంగ్రెస్లోకి చేరితే ఇప్పటికే ఖమ్మంలో( Khammam ) బలంగా ఉన్న కాంగ్రెస్ మరింత బలపడి జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయొచ్చని అంచనాలు వస్తున్నాయి.

ఒకపక్క పొంగులేటి శ్రీనివాసరావు( Ponguleti Srinivasa Rao ) మరోపక్క తుమ్మల మరోపక్క కమ్యూనిస్టుల తో బేరాసారాలు తో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్కు పరిణామాలు అన్ని కలిసి వస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి.షర్మిల పార్టీ విలీనం కూడా ఒక కొలిక్కి వచ్చేస్తే తెలంగాణ కాంగ్రెస్ అమ్ముల పొదిలో అస్త్రాలన్నీ చేరినట్టే భావించాల్సి వస్తుంది.

Telugu Congress, Khammam, Telangana, Ys Sharmila-Telugu Political News

మ్యాజిక్ ఫిగర్ 60 కి అవసరమైన వనరులన్నీ ప్రస్తుతానికి కాంగ్రెస్కు సమకూరినట్టే.ఇక ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవటమే తరువాయి అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది.కర్ణాటకలో సక్సెస్ అయిన హామీల ఫార్ములానే తెలంగాణలో( Telangana ) కూడా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది .ఇప్పటికే అక్కడ ఇచ్చిన ఐదు ప్రధాన హామీలు నాలుగు హామీలను అమలు మొదలుపెట్టిన కర్ణాటక కాంగ్రెస్ వచ్చే నెల నుంచి ఐదవ హామీను కూడా నెరవేరుస్తామని చెప్తుంది .దాన్ని రిఫెరెండం గా చూపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా తాము ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పక్క రాష్ట్రం కర్ణాటక పరిపాలనే దానికి నిదర్శనం అంటూ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Khammam, Telangana, Ys Sharmila-Telugu Political News

అలాగే తెలంగాణ కాంగ్రెస్ కు గుదిబండ గా మారిన సీనియర్లను కూడా ఒక పథకం ప్రకారం పక్కకు తప్పించేందుకు దరఖాస్తుల స్వీకరణ అంటూ కొత్త పథకం మొదలు పెట్టిన కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లోనూ విధేయత అంటూ మొహమటాలకు పోకూడదని వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.దాంతో బారసా తో హోరాహోరీ పోరు తప్పదని నిన్న మొన్నటి వరకు ఒక అడుగు వెనకకు నిలబడి నట్టుగా కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు బారాశతో సమానంగా పోటీ పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube