ప్రస్తుత టెక్నాలజీ కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు.ఫలితంగా పాతిక ముప్పై ఏళ్లకే రక్తపోటు, మధుమేహం, హార్ట్ స్ట్రోక్, శరీర బరువు అదుపు తప్పడం.
ఇలా ఎన్నో సమస్యల బారిన పడుతున్నారు.ఇవన్నీ వచ్చాక ఇబ్బంది పడటం కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.డైట్ లో అన్ని పోషకాలు మెండుగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.
రోజులో జస్ట్ 20 నిమిషాలు వాకింగ్, కంటి నిండా నిద్ర, బాడీకి అవసరమయ్యే వాటర్ ను అందిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ ను వారానికి రెండంటే రెండు సార్లు తీసుకున్న చాలు వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు బోలెడు ఆరోగ్య లాభాలు పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గ్రీన్ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక యాపిల్ మరియు చిన్న కీర దోసకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, కీర దోసకాయ( Cucumber ) ముక్కలు, రెండు లేదా మూడు ఫ్రెష్ పాలకూర ఆకులు, ఐదు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ సిద్ధమైనట్లే.
ఫైనల్ గా ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) ను మిక్స్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు లేదా తర్వాత తీసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
కొలెస్ట్రాల్ కరుగుతుంది.పాలకూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల రక్తహీనత( Anemia ) దరిచేరదు.ఇక ఈ గ్రీన్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.
మూత్రపిండాలు శుభ్రం గా మారతాయి.లివర్ పనితీరు మెరుగుపడుతుంది.
మరియు చర్మం కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.