అను ఇమ్మానియేల్( Anu Immanuel ).ఈ హీరోయిన్ నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
నాని సరసన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో అజ్ఞాతవాసి,నా పేరు సూర్య అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన రావణాసుర,గీత గోవిందం సినిమాలో ఒక చిన్న పాత్ర, నాగచైతన్యతో శైలజ రెడ్డి అల్లుడు, అల్లు శిరీష్ తో ఊర్వసివో రాక్షశివో వంటి సినిమాల్లో నటించింది.
ఇక వీటన్నింటిలో మజ్ను సినిమా తప్ప మిగతా ఏ సినిమాలు కూడా అను ఇమ్మానియేల్ కి స్టార్డం తెచ్చి పెట్టలేదు.
ఇక ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ కోలీవుడ్ హీరో కార్తీ సరసన జపాన్ ( Japan ) అనే సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఒక సంఘటనని కూడా బయటపెట్టింది.
తనని కూడా ఓ నిర్మాత కోరిక తీర్చమని అడిగాడు.కానీ నా కుటుంబ సహాయ సహకారాలతో నేను అందులో నుండి బయటపడ్డాను.అంటూ చెప్పింది.
అలాగే గత కొద్ది రోజులుగా ఓ యంగ్ హీరోతో అను ఇమ్మానుయేల్ ప్రేమాయణం సాగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ విషయంపై స్పందిస్తూ నేను ఓ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు.అయితే నేను కేవలం సినిమా కోసం మాత్రమే ఆ హీరో తో క్లోజ్ గా ఉన్నాను.
అలాగే ఆ సినిమాలో ఎమోషన్స్, సన్నివేశాలు, రొమాన్స్ పండాలని ఆ హీరోతో రొమాన్స్ పండించాను.అంతేకానీ ఆ హీరో తో మీరనుకున్న సంబంధం నాకు ఏమీ లేదు.అలాగే ఆ హీరో లాంచింగ్ డే నుండి మా మధ్య స్నేహం ఉంది.
కానీ అందులో వేరే రిలేషన్ మాత్రం లేదు.అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసరికి మా అమ్మ చెవిన పడి ఏంటి నీ మీద ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయి అని చాలా బాధపడింది.
ఇక ఇలాంటి విషయాలు ముందుగా మా మమ్మీకే తెలుస్తాయి.
ఎందుకంటే ఆమె న్యూస్ చాలా బాగా ఫాలో అవుతుంది.అలాగే అంతకుముందే ఆ హీరోకి సంబంధించిన కుటుంబంలో నుండి మరో హీరోతో కూడా నేను సినిమా చేశాను అంటూ అను ఇమ్మానుయేల్ స్పష్టం చేసింది.ఇక అను ఇమ్మానుయేల్ మాట్లాడిన మాటల ప్రకారం ఈమెకు ఎఫైర్ వార్తలు వినిపించింది అల్లు శిరీష్ ( Allu Sirish ) తోనే.
అలాగే అల్లు శిరీష్ కుటుంబ సభ్యుల్లో మరో హీరోతో అంటే అల్లు అర్జున్ తో కలిసి నా పేరు సూర్య సినిమాలో కూడా చేసింది.ఇక ఆ హీరో పేరు బయట పెట్టక పరోక్షంగా మాట్లాడినప్పటికీ కూడా అల్లు శిరీష్ పేరు ను గుర్తుపట్టారు.