మన టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో మాస్ హీరో అనే పదం ఎత్తితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.( Ntr ) కాలేజీ లో ఇంటర్ చదువుకునే వయస్సులో, సరదాగా స్నేహితులతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగే వయస్సులో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.
ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఇతను హీరో ఏంటి అనుకున్నారు అంతా, కానీ వచ్చిన రెండేళ్లలోపే ఊర మాస్ హీరో గా ఎదిగాడు.ఇండియాలోనే ఏ హీరో కి కూడా ఇది సాధ్యపడలేదు.
ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది.నూనూగు మీసాలు ఉన్న ఆ వయస్సులో కలలో కూడా ఊహించనటువంటి స్టార్ స్టేటస్ దక్కడం, ఆ స్టార్ స్టేటస్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక చాలా కాలం వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడడం వంటివి మనమంతా చూసాము.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని పరిశీలిస్తే ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి.
రాఖీ సినిమా( Rakhi movie ) సమయం లో అతని లుక్స్ చూసి జనాలు ఆయన సినిమాలను చూడడమే మానేశారు అట.ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్ చెప్పిందే, అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి సలహా ని పాటించి లైపో సర్జరీ చేయించుకోవడం, ఎన్టీఆర్ చిక్కిన చీపురు పుల్ల లాగ మారిపోయి కనీవినీ ఎరుగని మేక్ ఓవర్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది.ఇక అప్పటి నుండి సరికొత్త ఎన్టీఆర్ ని చూస్తూ వస్తున్నారు అందరూ.
నటన పరంగా ఈ జనరేషన్ బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే అందరూ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తారు.కానీ మహేష్ బాబు , రామ్ చరణ్ , అల్లు అర్జున్ కి ఉన్నన్ని అవార్డ్స్ ఎన్టీఆర్ కి లేవు.
రీసెంట్ గా ఆయన #RRR చిత్రం కి నేషనల్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యాడు, కానీ అవార్డు మాత్రం దక్కలేదు.
దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలా తీవ్రమైన అసహనం ఏర్పడింది.నటన గురించి అందరూ అలా గొప్పలు చెప్తారు, కానీ అవార్డ్స్ లేవు.పోనీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చూద్దాం అంటే సింహాద్రి( Simhadri ) తర్వాత ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్ ఒక్కటి కూడా లేదు.
కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయం లో రాజమౌళి( Rajamouli ) #RRR సినిమా కోసం మూడేళ్లు కేటాయించాడు, కానీ ఆ చిత్రం లో మెయిన్ హీరో రామ్ చరణ్ అన్నట్టుగా అనిపించింది, దీని కోసం మూడేళ్ళ సమయం వృధా చెయ్యడం అవసరమా, ఎందుకు ఫ్యాన్స్ ని ఇలా టార్చర్ చేస్తున్నావు అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి అభిమానులు తమలో ఉన్న కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు.అయితే అలా ఆవేశం లో ఉన్న ఫ్యాన్స్ ని మరికొంత మరి సీనియర్ ఫ్యాన్స్ సర్దిచెప్తూ ‘దేవర’ తో అన్నిటికీ సమాధానం చెప్తాం అని అంటున్నారు.