ధమాకా చిత్రానికి ముందు రవితేజ( Ravi Teja ) మార్కెట్ చాలా దారుణంగా ఉండేది.ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో ‘ధమాకా’ చిత్రం రావడం, ఆ సినిమా ఏకంగా రవితేజ కెరీర్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమా గా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఇక ఆ తర్వాత వెంటనే ‘వాల్తేరు వీరయ్య’( Waltheru Veeraya ) సినిమా రూపం లో మరో వంద కోట్ల రూపాయిల సినిమాని బ్యాక్ 2 బ్యాక్ కొట్టాడు.అయితే ఆ తర్వాత వచ్చిన ‘రావణాసుర’ ( Ravanasura )చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ రవితేజ యాక్టింగ్ కి మంచి పేరొచ్చింది.
ఇలా కమర్షియల్ పరంగా రవితేజ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్ లో నడుస్తుంది.ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘టైగర్ నాగేశ్వర రావు’ ( Tiger Nageswara Rao )అనే సినిమాతో ఈ దసరా కి మన ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రాన్ని రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇందులో రవితేజ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు.రవితేజ ని ఇది వరకు ఎన్నడూ చూడని యాంగిల్ లో చూసేసరికి ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురి అయ్యారు.
ఇంత క్రూరంగా రవితేజ ని ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ కూడా చూడలేదు.నిజ జీవితం లో జక్క్రిగిన యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది అని , ఈ దసరా రవితేజదే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.రీ రికార్డింగ్ ఇంకా పూర్తి కానీ సినిమా ఔట్పుట్ చూస్తేనే ఈ రేంజ్ లో చెప్తున్నారు అంటే, పూర్తి స్థాయి రీ రికార్డింగ్( Re recording ) జరిగిన తర్వాత ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai )ఒక పవర్ ఫుల్ రోల్ ని చేసింది.జానీ సినిమా తర్వాత సినీ రంగానికి దూరం గా ఉంటూ వచ్చిన ఆమె, ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.అంతే కాకుండా ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ నటించింది.ఇదే ఆమెకి తొలిసినిమా.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం.అందులో కేవలం నైజాం ప్రాంతం నుండే 20 కోట్ల రూపాయిల బిజినెస్ చేసిందట.
ఇది రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.