ఒక్కొక్కసారి రెస్టారెంట్ లో( Restaurant ) వేసే బిల్లులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.సర్వీస్ చార్జీతో పాటు పలు పదార్థాలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు.
ఉన్న బిల్లు కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ ఉంటారు.ఇలాంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.
మనం తిన్నదానికే కాకుండా సప్లై చేసిన వాటికి కూడా అదనపు బిల్లు వేస్తూ ఉంటారు.ఇలా ఎక్కువ బిల్లులు వేయడంలో ఇటాలియన్ రెస్టారెంట్స్( Italian Restaurants ) ముందు వరుసలో ఉంటాయి.
తాజాగా డైనింగ్ టేబుల్ వద్ద పుట్టినరోజు జరుపుకున్న ఓ ఫ్యామిలీకి రెస్టారెంట్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చింది.
చాలామంది రెస్టారెంట్లలో బర్త్ డే వేడుకలను( Birthday ) జరుపుకుంటూ ఉంటారు.స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.రెస్టారెంట్ లో అందరి మధ్య కేక్ కట్ చేసి జరుపుకుంటారు.
కానీ ఇలా పుట్టినరోజు జరుపుకోవడమే కాకుండా కేక్ లను ముక్కలుగా కట్ చేసినందుకు ఓ రెస్టారెంట్ యాజమాన్యం అదనపు బిల్లు వేసింది.ఓ ఇటాలియన్ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది.బర్త్ డే కేక్ ను 20 ముక్కలుగా కట్ చేసినందుకు ఏకంగా రూ.1800 సర్వీస్ ఛార్జ్ వేశారు.
ఒక కుటుంబం రెస్టారెంట్ కు వెళ్లింది.అక్కడ పిజ్జా, కూల్ డ్రింక్స్ కోసం 130 యూరోలు ఖర్చు చేశారు.అయితే బిల్లులో 20 యూరోలు అదనంగా వచ్చింది.దీంతో రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా.కేక్ ని( Cake ) 20 ముక్కలుగా కట్ చేసినందుకు వేసినట్లు చెప్పడంలో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.గతంలో గెరా లారియోలోని బార్ పేస్ అనే రెస్టారెంట్ కూడా ఇలాగే విచిత్ర రూపంలో బిల్లు( Bill ) వేసింది.
ఒక కస్టమర్ శాండ్‌విచ్‌ను రెండు భాగాలుగా కట్ చేయమని అడిగినందుకు అదనంగా బిల్లు వేశారు.