రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామం లో ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జరిగిన హత్యయత్నం కేసు లో పరారిలో వున్నా ఇద్దరిని ఈ రోజు రిమాండ్ కి తరలించినట్టు వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.కృష్ణ కుమార్( Circle Inspector Y.
Krishna Kumar ) తెలిపారు.కేసు వివరాలిలా ఉన్నాయి.
నూకల మర్రి గ్రామానికి చెందిన పెద్దవేణి మల్లయ్య(64) కు మొదటి వివాహం లో ఇద్దరు కుమారులు కాగా మొదటి భార్య మరణించటం తో రెండవ వివాహం నర్సవ్వ ను వివాహం చేసుకోగ మళ్ళీ ఇద్దరు కుమారులు జన్మించినారు.నలుగురు కుమారులకు ఆస్థి, భూమి పంపకాలు చేసినాడు, కానీ రెండవ కొడుకు తిరుపతి కి ఇచ్చిన 15 గుంటల భూమి విషయం లో గొడవ జరగగా మల్లయ్య, నర్సవ్వ లు తిరుపతి ని చంపాలి అనే ఉద్దేశ్యం తో గొడ్డలి తో దాడి చేయగా తిరుపతి కి గాయాలు అయ్యాయి.
ఇట్టి విషయం పైన ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా పై ఇద్దరు నిందితులు పరారిలో వున్నారు.ఈ రోజు నిందితులు ఎదురుగట్ల నుండి నూకల మర్రి కి వెళ్ళుటకు బస్టాండ్ వద్ద ఉండగా పోలీస్ వారు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరించటం జరిగింది.
ఇట్టి కేసు లో నిందితులను రిమాండ్ కి తరించటం లో సహకరించిన ఎస్ ఐ మారుతీ, సిబ్బంది షబ్బీర్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సంపత్, హోమ్ గార్డ్ రాణి లను సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు.