తెలంగాణ బిజెపి( BJP party )లో చేరికలు ఉత్సాహం చాలా కాలంగా కనిపించడం లేదు.కొద్ది నెలల క్రితం వరకు భారీగా చేరికలు కనిపించాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని కీలక నేతలు చాలామంది బిజెపి కండువా కప్పుకోబోతున్నారనే హడావుడి నడిచింది.కానీ చివరి నిమిషంలో చాలామంది హ్యాండ్ ఇవ్వడంతో చేరికలు అంతంత మాత్రంగానే చోటుచేసుకున్నాయి.
అయితే చేరికలు కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ప్రత్యేకంగా నియమించినా, ఆశించిన స్థాయిలో పార్టీలోకి చేరికలు లేకపోవడంతో ఆ పార్టీలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.దీంతో బిజెపి అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు.
ప్రస్తుతం చేరికలపైనే తెలంగాణ బిజెపి ఎక్కువగా దృష్టి సారించింది.తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో, ఇప్పటి వరకు బిజెపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారందరినీ పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు ఈటెల రాజేందర్ ( Etela Rajendar )స్పందించారు.మరికొద్ది రోజుల్లోనే తెలంగాణకు చెందిన 22 మంది కీలక నేతలు బిజెపిలో చేరబోతున్నారంటూ రాజేందర్ హింట్ ఇచ్చారు.దీంతో బిజెపిలో చేరబోతున్న ఆ కీలక నేతలు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.రాజేందర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ , కాంగ్రెస్ కూడా ఇదే విషయంపై ఆరా తీస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amith sha )తెలంగాణ పర్యటనలో కొంతమంది చేరుతారని, ఆ తరువాత ఇక వరుసగా చేరికలు ప్రక్రియ ఉంటుందని రాజేందర్ తెలిపారు.

.ఈనెల 27న తెలంగాణకు అమిత్ షా రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్( BRS party ) , కాంగ్రెస్ లోని కీలక నేతలు బిజెపిలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.బిజెపిలో చేరబోతున్న 22 మంది కీలక నేతలు గురించి రాజేందర్ స్పందించారు.
పార్టీలోకి వచ్చే వారంతా గెలుపు గుర్రాలేనని ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మరింతగా టెన్షన్ పడుతున్నారు.దీంతో ఆ 22 మంది ఎవరు అనే విషయంపై ఆరాతీస్తున్నాయి.
అంతేకాదు ఆ 22 మంది త్వరలోనే బిజెపిలో చేరుతున్నారని, కావాలంటే రాసి పెట్టుకోంది అంటూ రాజేందర్ ధీమాగా చెబుతుండడం తో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.