కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తాన్ టెర్రరిస్టులు.. హిందూ ఆలయంలో విధ్వంసం

కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.బ్రిటీష్ కొలంబియాలోని లక్ష్మీ నారాయణ ఆలయంలో విధ్వంసం సృష్టించారు.

 Hindu Temple In Canada Vandalised, Slain Khalistani Terrorist's Posters Put Up ,-TeluguStop.com

ఆలయ గోడలపై ఖలిస్తాన్ నినాదాలు , భారత వ్యతిరేక రాతలు రాశారు.అలాగే ఖలిస్తాన్ రెఫరెండానికి సంబంధించిన పోస్టర్లను అంటించారు.

వీటిపై జూన్ 18 నాటి ఘటనలో ఇండియా ప్రమేయంపై కెనడా దర్యాప్తు చేస్తుంది అంటూ రాసి వుంది.అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఫోటోలు కూడా ఆ పోస్టర్‌పై వున్నాయి.

Telugu Canada, Colombia, Hardeepsingh, Hindu Temple, Metro Vancouver, Ottawa, Po

కాగా.జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌‌( Hardeep Singh Nijjar ) దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.

ఆ తర్వాతి నుంచే ఎస్ఎఫ్‌జే బెదిరింపులు పెరిగాయి.భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సుల్ జనరల్స్‌‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్లు వెలిశాయి.

Telugu Canada, Colombia, Hardeepsingh, Hindu Temple, Metro Vancouver, Ottawa, Po

మరోవైపు.కెనడా( Canada )లోని భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఖలిస్తాన్ వేర్పాటువాదులు గత కొన్ని రోజులుగా ప్రదర్శిస్తున్న భారత వ్యతిరేక పోస్టర్‌లపై కెనడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.గత మంగళవారం వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం వెలుపల పోస్టర్ కనిపించడంతో కెనడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.దేశంలోని అంతర్గత భద్రతా విభాగం ‘‘ పబ్లిక్ సేఫ్టీ కెనడా’’ ఒక ట్వీట్‌లో ఈ విచారణపై ప్రకటన చేసింది.

కెనడాలో హింసను ప్రేరేపించడానికి చోటు లేదని.భారత దౌత్య అధికారులపై బెదిరింపులకు సంబంధించి ఆన్‌లైన్ వీడియో సర్క్యూలేషన్ అయిన నేపథ్యంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తులో నిమగ్నమయ్యారని పేర్కొంది.

మెట్రో వాంకోవర్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో , ముఖ్యంగా సర్రే పట్టణంలో కనిపించిన పోస్టర్‌ల మాదిరిగానే తాజా పోస్టర్ వుంది.ఈ పోస్టర్లలో కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తల ఫోటోలు, పేర్ల కింద ‘వాంటెడ్’’ అనే పదాన్ని ఉపయోగించారు ఆగంతకులు.

ఒట్టావాలోని భారత హైకమీషనర్, వాంకోవర్, టొరంటోలోని కాన్సుల్ జనరల్స్ పేర్లను వారు ప్రస్తావించారు.మంగళవారం ఉదయం కాన్సులేట్ హౌసింగ్ భవనం ప్రవేశ ద్వారం వద్ద పోస్టర్‌ను గుర్తించిన అధికారులు దానిని తొలగించారు.

దుండగులు దానిని తెల్లవారుజామున అక్కడ వుంచినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube