సుమారు 300 ఏళ్ళ పాటు బ్రిటిష్( British ) వారి అరాచకాలకు బలైపోయిన భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు అనేక మంది వీరులు తమ ప్రాణాలు వదిలారని మనందరికీ తెలుసు.కానీ ఆ వీరులతో పాటు మనకు తెలియని ఎందరో వీర నారులు కూడా స్వాతంత్ర్యోద్యమంలో తమ ప్రాణాలు కోల్పోయారు.
కానీ మన చరిత్ర వారి త్యాగాన్ని గుర్తించడంలో విఫలమయింది.మనం మరచిన వీర నారులలో ఒకరే కల్పనా దత్. కల్పనా దత్తా భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన భారతీయ స్వతంత్ర సమరయోధురాలు.
కల్పనా దత్( Kalpana Dutt ) 1913 , జులై 27న చిట్టగాంగ్ లోని( Chittagong ) సిర్పూర్ గ్రామంలో జన్మించింది.చిన్నప్పటి నుంచే బానిసత్వాన్ని దగ్గరనుంచి చూసిన కల్పనా మనసులో స్వాతంర్యోద్యమ కాంక్ష రగలడం మొదలయింది.14 ఏళ్ళ వయసులోనే చిట్టగాంగ్ స్టూడెంట్స్ కాంఫరెన్సులో మాట్లాడిన కల్పనా తన వాక్చాతుర్యం తో ప్రజలలో ఆవేశాన్ని నింపింది.1929లో కలకత్తా లోని బేథాని కాలేజీ లో చేరింది కల్పన.ఈ సమయంలోనే తాను మానసికంగా, శారీరకంగా బలపడింది.
ఉద్యమకారుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమంలో అడుగు పెట్టింది.
తన ఉద్యమం స్టూడెంట్స్ యూనియన్ ద్వారా మొదలయింది.యూనియన్ ద్వారా బినా దాస్,( Binadas ) ప్రీతిలత వద్దార్( Pritilata Vaddar ) వంటి ఉద్యమకారులతో పరిచయం ఏర్పడింది.వారితో కలిసి ఏప్రిల్ 18 ,1930 న చిట్టగాంగ్ ఆర్మోరీ లూటీ లో పాల్గొంది.
వీరు ఆయుధశాల నుండి 2,000 తుపాకులు, 10,000 రౌండ్ల తుపాకీ గుళ్ళు, మరియు ఇతర ఆయుధాలు దోచుకున్నారు.తరువాత ఆమె సూర్య సేన్ ఏర్పరిచ్చిన “ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ”లో( Indian Republican Army ) చేరింది.
ఈ సేనలో ఉంటూ అనేక మార్లు బ్రిటీష్ సైనికులకు ఎదురెళ్ళింది ఈ ధీర మహిళా.ఒక మారు జైలుకి కూడా వెళ్ళింది.ఆమె జైల్లో ఉన్నప్పుడే గాంధీ గారిని కలిసింది.ఆయనను తన ఉద్యమానికి వ్యతిరేకి అని, కానీ తాను జైలు నుంచి బయటకు రావడానికి ఆయన సహాయం చేసారని తాను రచించిన పుస్తకం “చిట్టగాంగ్ ఆర్మోరీ ఎటాక్ “లో తెలిపింది.
1939 లో జైలు నుంచి బయటకు వచ్చిన కల్పన, తన పై చదువులు పూర్తి చేసి రాజకీయాలలో అడుగు పెట్టింది.కమ్యూనిస్ట్ పార్టీలో( Communist Party ) చేరింది.1943 లో కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, పురాన్ చంద్ జోషిని వివాహమాడింది.అదే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ లో కమ్యూనిస్ట్ కాండిడేట్ గా పాల్గొని ఓడిపోయింది.తరువాత కొన్నాళ్ళకు పార్టీలో విభేదాల కారణంగా పార్టీ ని విడిచి, భర్తతో కలిసి ఢిల్లీ చేరుకుంది.1979వ సంవత్సరంలో, స్వాతంత్ర్యోద్యమంలో ఆమె పాత్రకు గాను భారతదేశ ప్రభుత్వం ఆమెను “వీర మహిళ”( Veer Mahila ) అనే బిరుదు తో సత్కరించింది.ఆమె 1995 , ఫిబ్రవరి 8 న మరణించింది.కల్పన దత్ జీవితం ఆధారంగా ఒక చిత్రం కూడా తెరకెక్కింది.“ఖేలేంగే హమ్ జి జాన్ సి” అన్న పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్పన పాత్రలో దీపికా పదుకొనె నటించింది.