తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికలపై టీ కాంగ్రెస్ ( Telangana Congress )గట్టిగా దృష్టి పెట్టింది.ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత కొద్దిరోజులుగా నానా హడావిడి చేస్తున్నారు హస్తం నేతలు.వరుసగా సమావేశాలు నిర్వహించడం, కమిటీలను ఏర్పాటు చేయడం, నేతలకు దిశ నిర్దేశం చేయడం వంటివి నిర్వహిస్తూ పోలిటికల్ హీట్ పెంచుతోంది టీ కాంగ్రెస్.
కాగా ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి.సరిగ్గా నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ తలమునకలైంది.
అభ్యర్థుల ఎంపిక కోసం ఇటీవల స్క్రినింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది పార్టీ హైకమాండ్.ఈ కమిటీ చైర్మెన్ గా కె.
మురళిధరన్( K Muraleedharan ) ను నియమించింది.
బాబీ సిద్దిఖ్, జిగ్నేశ్ వంటివారిని సభ్యులుగా ఎన్నుకొని రేవంత్ రెడ్డి,( Revanth Reddy ) బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారిని ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా నియైంచింది.అభ్యర్థుల ఎంపికలో ఈ స్క్రినింగ్ కమిటీదే ముఖ్య పాత్ర.కాగా గత కొన్నాళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్క్రినింగ్ కమిటీలో చోటు కల్పించడంతో ఆ వార్తలకు తెర పడింది.
ఇక ఇప్పుడు స్క్రినింగ్ కమిటీ ఇచ్చే సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుందనేదే ఆసక్తికరంగా మారింది.సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉనుందని ఇప్పటికే పలు మార్లు చెప్పుకొచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే ఈ మద్య ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలోకి చేరికలు బాగానే పరుగుతున్నాయి.దీంతో పాతవారిని కాదని కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) సూచించిన వారికే అధిష్టానం టికెట్లు ఫైనల్ చేసే అవకాశం ఉంది.వచ్చే నెల చివరిలోగా లేదా వచ్చే నల మొదటి వారంలోగా అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ లిస్ట్ ను అధిస్థానానికి చేరే వేసే అవకాశం ఉంది స్క్రినింగ్ కమిటీ.
ఎందుకంటే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.అందుకే అభ్యర్థుల ఎంపిక కోసం హడావిడిగా స్క్రినింగ్ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం.
మరి హస్తంపార్టీ బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో చూడాలి.