కరీంనగర్ జిల్లాలో చిన్నారి కనిపించకుండా పోయిన ఘటన మిస్టరీగా మారింది.మూడు రోజుల కిందట రెండున్నరేళ్ల చిన్నారి కృతిక అదృశ్యమైంది.
దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కూలిపనుల కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కృతిక కుటుంబం కరీంనగర్ జిల్లాలో నివాసం ఉంటున్నారు.
ఈనెల 27వ తేదీన మధ్యాహ్న సమయంలో తండ్రి పక్కన పడుకున్న కృతిక మధ్యలో లేచి బయటకు వెళ్లిపోయింది.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అయితే చిన్నారి బయటకు వెళ్లిన సమయంలో ఎవరూ చూడకపోవడంతో ఎటు వెళ్లిందో తెలియలేదు.చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.