ఉల్లినారు పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

భారతదేశ మార్కెట్లో డిమాండ్ ఉండే కూరగాయలలో ఉల్లి( Onion ) కూడా ఒకటి.కొంతమంది రైతులు ఉల్లి సాగు చేసి లక్షల్లో ఆదాయం పొందుతూ ఉంటే.

 Fiber Cultivation In Onion Precautions To Be Take Details, Fiber Cultivation ,on-TeluguStop.com

మరికొంతమంది రైతులు ఉల్లి సాగు చేసి అప్పుల పాలు అవుతున్నారు.దీనికి ప్రధాన కారణం ఉల్లి సాగు చేయడంపై పూర్తిగా అవగాహన లేకపోవడమే.

ఉల్లి సాగు చేసే రైతులు తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన మెళుకువలు ఏంటో తెలుసుకుందాం.

ఉల్లి సాగుకు అనువైన నేలల విషయానికి వస్తే.

నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి.ఇక ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు ఉల్లి సాగుకు అనుకూలంగా ఉండవు.

ఉల్లి సాగుకు అనువైన కాలాల విషయానికి వస్తే.ఖరీఫ్ సీజన్లో( Kharif Season ) సాగు చేయాలనుకుంటే జూన్, జూలై నుండి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేయవచ్చు.

రబీ సీజన్లో సాగు చేయాలనుకుంటే నవంబర్ చివరి నుండి ఏప్రిల్ వరకు సాగు చేయవచ్చు.అలా కాకుండా వేసవిలో సాగు చేయాలనుకుంటే జనవరి, ఫిబ్రవరి నెలలలో సాగు చేయవచ్చు.

Telugu Agriculture, Drip, Farmers, Fiber, Kharif Season, Rabi Season-Latest News

ఉల్లి సాగులో అతి ముఖ్యమైనది నారుమడి పెంపకం. నారు మడిని రెండు విధాలుగా పెంచుకోవచ్చు.ఒకటి చిన్నచిన్న మడులలో నాటుకునే పద్ధతి, రెండు ఎత్తైన బెడ్లలో డ్రిప్ ఇరిగేషన్( Drip Irrigation ) సౌకర్యం ద్వారా పెంచవచ్చు.ఒక ఎకరం పొలనికి మూడు కిలోల విత్తనాలు అవసరం.

విత్తనాలను ముందుగా ఆక్సీ క్లోరైడ్ 3గ్రా.తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఉల్లిలో మేలురకం విత్తనాల విషయానికి వస్తే.బళ్లారి రెడ్, రాంపూర్ రెడ్, కళ్యాణ్ పూర్, ఆర్కనీకేతన్, వైట్ ఆనియన్, అర్కా ప్రగతి, పూస వైట్ రౌండ్ లాంటి రకాలలో

Telugu Agriculture, Drip, Farmers, Fiber, Kharif Season, Rabi Season-Latest News

ఆ ప్రాంతాలలో డిమాండ్ ఉన్న రకాన్ని ఎంపిక చేసుకొని నారుమడి వేసుకోవాలి.నారుమడిలో పది రోజులకు ఒకసారి ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి.నారు కాస్త పెరిగిన తర్వాత కార్పో ప్యురాన్ 3జి గుళికలు నారుమడిలో చల్లి నీటి తడి అందించాలి.

నారును ప్రధాన పొలంలో నాటడానికి ముందే పొలంలో ఫ్లుక్లోరాలిన్ 45% ను ఒక లీటరు నీటిలో కలిపి పొలంలో పిచికారి చేసి కలియదున్నిన తర్వాత నారుమడిని పొలంలో నాటుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube