అర శాతం లేని వారు పాలకులుగా ఉంటే అరవై శాతం ఉన్నవారు ఎక్కడుండాలి...?

యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీసీల రాజకీయ ప్లీనరీ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమనికి ముఖ్యాతిథులుగా సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్,జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సికిలమెట్ల శ్రీహరి హాజరయ్యారు.

 If Those Who Dont Have Half A Percent Are The Rulers Where Should The Sixty Perc-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు అంటే అన్ని రాజకీయ పార్టీలకు లోకువైందని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీసీల ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడానికి ప్రయత్నిస్తారని అన్నారు.జనాభాలో అత్యధిక శాతం ఉన్నవాళ్ళకు రాజకీయ అధికారం దక్కాలని,కానీ,నేడు అర శాతం ఉన్నవారు పాలకులుగా ఉంటే 60 శాతం ఉన్న బీసీలు బాధితులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక రాష్ట్రంలో అగ్రకుల రాజకీయాలను బీసీలు గమనించాలన్నారు.బీసీ ప్లీనరీకి మునుగోడు నియోజకవర్గ నుండి భారీ ఎత్తున బీసీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు దూసరి వెంకటేష్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లపల్లి లక్ష్మణ్, బీసీ నాయకులు చిలువేరు అంజయ్య,ఏపూరి సతీష్, తెలంగాణ భిక్షం,ఉప్పల వెంకటేష్,అందే నరేష్, చిలివేర్ శంకర్,సికిలమెట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube