వైరల్: టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్నవైనం... శభాష్ అంటున్న నెటిజనం!

మీరు నిత్యం సోషల్ మీడియా( Social media )లో నిమగ్నమై ఉంటే, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోందనే విషయాన్ని మీరు ఈపాటికే గ్రహించి ఉండాలి.అవును, అవసరానికి తగ్గట్టు కొత్త కొత్త ఐడియాలను అమలు చేయడంలో భారత్‌ ఎల్లపుడూ ముందుంటుందని ఈ వీడియో మరోమారు నిరూపిస్తోంది.

 Viral: Water Is Falling With A Tube Of Toothpaste. Netizens Saying Well Done,-TeluguStop.com

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి కళాకారులు బయటకు వస్తున్నారు.లేదంటే వీళ్ళ ఆచూకీ ఎప్పటికీ తెలిసే ఆస్కారం లేదు.

నేడు సోషల్‌ మీడియాలో ఇలాంటి ఐడియాలకు మంచి గిరాకీ వుంది.తాజాగా ఇంటర్నెట్‌లో ఒక వీడియో అందరినీ అమితంగా అలరిస్తోంది.

దీనిని చూసినవారంతా సదరు మహిళ ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే, వాటర్ ట్యాప్‌( Water tap ) విరిగిపోవడంతో ఒక మహిళ దానికి టూత్‌పేస్ట్‌ ట్యూబ్‌ కత్తిరించి గట్టిగా బిగించింది.ఆ తరువాత దాని మూత తీస్తూ నీటిని పట్టుకుంటోంది.ఒక్కసారి తనకు కావలసిన నీటిని పెట్టుకున్నాక మరలా ఆ మూత గట్టిగా దానికి బిగించేస్తోంది.

దీనిని చూసిన నెటిజనం అలాంటి సమస్యలు తాము చాలా సార్లు ఎదుర్కొన్నప్పటికీ ఆ ఐడియా తమకి రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఆమె చేసిన ఆలోచనని మెచ్చుకుంటూ ఆమెని ఆకాశానికెత్తేస్తున్నారు.

వీడియో ప్రారంభంలో ఒక మహిళ నీటిని పట్టుకునేందకు ఒక బకెట్‌ తీసుకురావడం మనం చూడవచ్చు.తరువాత అక్కడ విరిగి ఉన్న ట్యాప్‌ ఉండడంతో ఆ విధంగా ఉంటే నీటిని పట్టుకోవడం ఇబ్బందికరం అని గ్రహించి, ఆమె ఒక టూట్‌పేస్ట్‌( Toothpaste ) కట్‌ చేసి, ఆ టాప్‌కు గట్టిగా బిగిస్తుంది.తరువాత కావలినంత నీటిని పట్టుకుని, తరువాత దానికి మూత మరలా బిగిస్తుంది.జూలై 12న ఈ వీడియో షేర్‌ కాగా ఇప్పటి వరకూ దీనికి లక్షల్లో చూస్తున్నారంటే మీరు అర్ధం చేసుకోవచ్చు… ఈ వీడియో కెపాసిటీ.9 సెకెన్లు ఈ వీడియోని చూసిన నెటిజన్లు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోని చూసి మీమీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube