సోషల్ మీడియా( Social media)లో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని నవ్వుని తెప్పిస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తూ ఉంటాయి.
కొన్ని వీడియోలు ఆశ్చర్య పరిస్తే ఇంకొన్ని చాలా దారుణంగా అనిపిస్తాయి.ఇక తాజాగా ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది.
భార్య భర్తలతో గొడవ పడిన ఓ మహిళ నీ భార్య కంటే నేనే బెటర్ అంటూ లిప్టులో నానా రచ్చా చేసిన వీడియో ఇపుడు నెటిజన్లకు కితకితలు పెడుతోంది.ఈ వీడియోలో ఓ మహిళ తన తన పెంపుడు కుక్కను తీసుకుని లిఫ్ట్ ఎక్కింది.
అదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరు లిఫ్ట్ ఎక్కటానికి వచ్చారు.
అయితే లిప్టులో కుక్క ఉండటం గమనించిన ఆ వ్యక్తి నా భార్య గర్భవతి మీ కుక్క కరుస్తుందేమో దానికి మాస్క్ వేయండి అని సూచించాడు.
కానీ దానికి ఆ కుక్క యజమాని సమ్మతించలేదు.పైగా అంతెత్తున ఎగిరి మండిపడింది.కుక్క( Dog )కు మాస్క్ వేయనంటే వేయనని చెప్పింది.దానికి అతను నా భార్య గర్భిణి నీ కుక్క కరిస్తే మేమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా.మాస్క్ వేయండి అని చెప్పాడు.దానికి ఆమె వాగ్వాదానికి దిగడంతో అతని భార్య కూడా సెన్స్ లేదా అంటూ మండిపడింది.
అతను కోపంతో మండిపడుతు ”ఈ మహిళ అసలు మనిషేనా”.అంటాడు.
దానికి అమె ”నీ భార్య కంటే నేనే బెటర్” అంటూ మొండిగా సమాధానం చెబుతుంది.దాంతో వారు షాక్ అవుతారు.కుక్క నోటికి మాస్క్ వేసేది లేదు.మీరు 30 నిమిషాలు అక్కడే నిలబడ్డా ఓకే నేనుమాత్రం నా కుక్కకు మాస్క్ వేయను! అని తెగేసి చెబుతుంది.ఉత్తరప్రదేశ్( Uttar Pradesh) నోయిడా లాజిక్స్ సొసైటీలోని లిప్టులో జరిగిన ఈ రచ్చ సోషల్ మీడియలో వైరల్ కావడం మనం గమనించవచ్చు.కుక్క మెడలోనే మాస్క్ వేలాడుతున్నట్లుగా ఈ వీడియోలో మనం చూడవచ్చు.
దాంతో కొంతమంది నెటిజన్లు నవ్వినప్పటికీ కొంతమంది మాత్రం మాస్క్ ఉన్నా వేయనని ఆమె చెప్పటం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు.ఇటీవల కుక్కలు కరిచిన ఘటనలు జరుగుతున్న క్రమంలో సదరు వ్యక్తులు భయడపటంలో తప్పులేదంటున్నారు.
ఈ ఘటనను మొత్తం సదరు దంపతులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.