రూ.7.5 లక్షలకే కొత్త ఇళ్లా? ఇదొక పెద్ద జోక్ అని నవ్వుకుంటున్నారా? నేటి దైనందిత జీవితంలో అది దాదాపు అసాధ్యం అని అంటారా? అయితే ఈ కధనం వింటే మీరు ఆశ్చర్యపోతారు.పట్టణాల్లో సామాన్యుడి జీవితం అనేది చాలా దయనీయంగా సాగుతుంది.
జీతమైతే కనిపించని సూక్ష్మజీవి వంటిది.ఎందుకంటే జీతం వచ్చిన రోజే అకౌంట్ లోంచి మాయమైపోతుంది.
ఇంటి అద్దె, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, ఇతర ఖర్చులు ఇలా అనేక ఖర్చులు పోగా జీతంలో మిగిలేది శూన్యం.ఇలా దేశంలో ఆర్థిక చట్రం కింద పడి నలిగిపోతున్న వారు కొన్ని లక్షలాదిమంది వున్నారు.

ఇక ఇలాంటి పరిస్థితులలో సొంతిల్లు కట్టుకోవాలన్న కల కల్లగానే మిగిలిపోతుంది.అయితే, సొంతిల్లు కావాలని కోరుకునేవారి కోసం 7.5 లక్షల రూపాయలకే ఇల్లు అందిస్తున్నాడు బెంగళూరు( Bangalore) యువకుడు.అతని పేరు మిహిర్ మెండా( Mihir Menda ).చిన్నతనంలో అతగాడు ఆడుకోడానికి వాచ్ మేన్ ఇంటికి వెళ్ళినప్పుడు.అతని ఇరుకైన ఇంటిని చూసి చాలా బాధపడ్డాడట.
దాంతో అప్పుడే అలాంటి పేదవారి కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు మిహిర్.మిహిర్ అమెరికాలో చదువుకుని వచ్చాడు.
చిన్నతనంలో అనుకున్న ఆశయానికి అర్బన్ అప్ స్టార్టప్ ( UrbanUp startup )రూపంలో పునాది వేశాడు.ఇదొక సామాజిక వ్యాపార సంస్థ.

పేదలకు ఇల్లు కట్టుకోవడం కష్టం కాబట్టి ఆ డబ్బును దాతల నుంచి సేకరిస్తారు ఇక్కడ.అతి తక్కువ ధరకే నాణ్యమైన ఇళ్లను వీరు నిర్మిస్తున్నారు.ఈ ఇళ్ల నిర్మాణంలో నిర్మాణ వ్యర్థాలు, పాత ఇటుకలను వినియోగిస్తున్నారు.ఈ క్రమంలో బెంగళూరులో 700 మంది సొంతింటి కల నిజమైంది.ప్రతి ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది.దీని ఖరీదు ఏడున్నర లక్షలు అయితే లబ్ధిదారుని కుటుంబం డౌన్ పేమెంట్ కింద రూ.2 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.మిగతా డబ్బు సులభ వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వాయిదా సొమ్ము ఆ కుటుంబ ఆదాయంలో 10 శాతం మాత్రమే ఉంటుంది.







