వినాయకుడికి రెయిన్ కోట్ లేదు నాన్నా.. చిన్నారి క్యూట్ వైరల్ వీడియో

ఏమీ తెలియని వయస్సులో చిన్నపిల్లలు( Children ) మాట్లాడే మాటలు, చేసే పనులు చాలా క్యూట్ గా అనిపిస్తాయి.ముద్దు ముద్దుగా వాళ్లు మాట్లాడే మాటలు అందరికీ నచ్చుతాయి.

 A Kid Enquiring About Ganpati Bappas Raincoat Details, Lord Ganesha, Raincoat, D-TeluguStop.com

చిన్నపిల్లలు ప్రవర్తించే తీరు, వాళ్లు చేసే అల్లరి పనులు, అడిగే ప్రశ్నలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.చిన్నపిల్లలకు సంబంధించిన ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో( Social Media ) విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వీడియోలను చూసి అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు.తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఒక పాప తన కుటుంబసభ్యులతో కలిసి వినాయకుడి టెంపుల్‌కి( Vinayaka Temple ) వెళ్లింది.ఆ సమయంలో భారీగా వర్షం పడటంతో భక్తులందరూ గొడుగులు పట్టుకోవడంతో పాటు రెయిన్ కోట్‌లను( Rain Coat ) ధరించి ఉన్నారు.ఇక బాలికతో పాటు తల్లిదండ్రులు కూడా రెయిన్ కోట్ ధరించారు.ఈ దేవాలయంలో వినాయకుడి విగ్రహం బయట ఉంది.అందరూ దేవుడికి నమస్కరించి ప్రార్థిస్తున్నారు.పాప కూడా అందరితో పాటు చేతులు జోడించి నమస్కారం చేసుకుంది.

ఈ సందర్భంగా చిన్నారికి ఒక డౌట్ వచ్చి తన తండ్రిని ఒక ప్రశ్న అడిగింది.

‘నాన్నా.మనందరికీ రెయిన్ కోట్ లు ఉన్నాయి.వినాయకుడిని రెయిన్ కోట్ ఎందుకు లేదు’ అంటూ క్యూట్ క్యూట్ గా తన తండ్రిని ప్రశ్నించింది.

దీంతో ఆ తండ్రి కుమార్తె మాటలకు తెగ నవ్వుకున్నాడు.పక్కనే ఉన్న కొందరు చిన్నారి మాటలను కెమెరాల్లో బంధించారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.గాడ్ మాన్ చికానా అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

జులై 6న ఈ వీడియోను పోస్ట్ చేయగా.ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.వెరీ క్యూట్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube