స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) మరియు త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అలా వైకుంఠపురం లో ‘( Ala Vaikhuntapuramlo ) 2020 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించి , ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమా లోని పాటలు ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాయి.
ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ మరియు టిక్ టాక్ లో ఎక్కడ చూసిన ఈ పాటలతోనే రీల్స్ మరియు వీడియోస్ చేస్తూ ఉండేవారు నెటిజెన్స్.స్టోరీ చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ఎంటెర్టైమెంట్ తో కూడా అద్భుతమైన టేకింగ్ వల్ల సినిమా వేరే లెవెల్ కి వెళ్ళింది.
అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా కేవలం తెలుగు వెర్షన్ కి కలిపి 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ కూడా సూపర్ హిట్స్ కొట్టారు, కానీ ఒక్కరు కూడా ‘అలా వైకుంఠపురం లో ‘ మూవీ కలెక్షన్స్ ని దాటలేకపోతున్నారు.అయితే ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం సెకండ్ హాఫ్ లో షూటింగ్ జరుగుతున్న సమయం లోనే కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడం.ముందు గా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం స్టోరీ మొత్తం చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుందని అల్లు అర్జున్ కి అనిపించిందట.
ఇదే విషయాన్నీ త్రివిక్రమ్ కి చెప్పగానే, ఆయన వెంటనే అప్పటికప్పుడు స్క్రిప్ట్ లో సవరింపులు చెయ్యడం, లేదా కొత్త సన్నివేశాలను రాయడం వంటివి చేసేవాడట.ముఖ్యంగా సెకండ్ హాఫ్ కి హైలైట్ గా నిల్చిన బోర్డు మీటింగ్ సన్నివేశం ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ లో లేదట.
త్రివిక్రమ్ అప్పటికప్పుడు అనుకోని రాసిన సన్నివేశం అంట అది, ఆ సన్నివేశానికి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే.
అలా ఎన్నో మార్పులు చేర్పులు అప్పటికప్పుడు అనుకోని చెయ్యబట్టే ఈ చిత్రం ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందని, రొటీన్ అనే ఫీలింగ్ వచ్చేలా తీసి ఉంటే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు.ఇప్పుడు అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాల్గవ సారి మరో సినిమా రాబోతుంది.నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది.
చూడాలి మరి కమర్షియల్ గా ఈ సినిమా కూడా ‘అలా వైకుంఠపురం లో’ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
.