ఈ మధ్య యూత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యారు.ఇక్కడ అత్యంత పాపులర్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఈ యాప్ లను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు.
మరి వీటిల్లో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ను మరింత ఎక్కువుగా వాడుతున్నారు.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు ఇంస్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతగా ఇంస్టాగ్రామ్ ఈ మధ్య కాలంలో పాపులర్ అయ్యింది.సాధారణ యువత మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం ముఖ్యమైన విషయాలను పంచుకోవాలంటే ఇంస్టాగ్రామ్ ను మాత్రమే ఎంచుకుంటున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ కలిగి ఉన్నాయి.అయితే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఇంకా చేరలేదు.

కానీ ఇప్పుడు సమయం ఆసన్నం అయ్యింది అని తెలుస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కూడా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్నీ స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Nagababu ) సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం అంత ఇంత కాదు.అత్యంత పవర్ ఫుల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లోకి పవన్ కూడా ప్రవేసిస్తే రికార్డ్ సృష్టించడం ఖాయం.

ఈ రోజు కానీ రేపు కానీ ఈయన అఫిషియల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది అని పవర్ స్టార్ ఇంస్టాగ్రామ్ లోకి అలా అడుగు పెడతారు అని అంటున్నారు.ఇది నిజంగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.అయితే ఈ అకౌంట్ ను పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగిస్తారని అంటున్నారు.ప్రజెంట్ విజయ్ దళపతి పేరు మీద 99 నిముషాల్లోనే 1 మిలియన్ క్రాస్ చేసిన రికార్డ్ ఉంది.
మరి ఈ రికార్డ్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ చెరిపేసి ఆయన పేరు మీద సరికొత్త రికార్డ్ సృష్టిస్తారో లేదో వేచి చూడాలి.