చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం కలకలం చెలరేగింది.సదుం మండలం జోగివారిపల్లెలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి.
అటవీ ప్రాంతం నుంచి సుమారు 15 ఏనుగులు బయటకు వచ్చాయి.దీంతో ఏ క్షణంలో గ్రామాల్లోకి చొరబడతాయోనని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు గ్రామాల్లోకి రాకుండా తిరిగి అటవీలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.