సాధారణంగా దేవాలయాలకు( temples ) వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం.అయితే చాలా సందర్భాలలో దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చి చూసిన తర్వాత చెప్పులు కనిపించవు.
అయితే చాలా సందర్భాలలో దేవాలయాల వద్ద బయట విడిచిన చెప్పులు దొంగతనానికి గురవుతాయి.అందుకు అసలు బాధపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
ఎందుకంటే చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళినప్పుడే చెప్పులు ఉంటాయా అన్న భయంతోనే దేవాలయానికి వెళ్తారు.
అయితే దేవాలయాల వద్ద చెప్పులు పోతే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు.చెప్పులు విడిచేటప్పుడే పోతాయేమో అని ఆందోళన ఉన్న చెందాల్సిన అవసరం అంతకంటే లేదు.ఒకవేళ దేవాలయాల వద్ద మీ చెప్పులు దొంగతనానికి గురైతే బాధపడడం మానేసి సంతోషంగా ఉండవచ్చు.
ఎందుకంటే దేవాలయాల వద్ద చెప్పులు పోవడం మన జీవితంలో జరిగే శుభాలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా భావిస్తారు.
చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయని చెబుతారు.
చెప్పులు చోరీకి గురైతే అప్పుల బాధ నుంచి బయట పడతామని పేదరికం నుంచి ముక్తి పొందవచ్చని చెబుతున్నారు.ముఖ్యంగా శనివారం రోజు దేవాలయం వద్ద చెప్పులు పోతే మరీ మంచిది అని చెబుతున్నారు.శనివారం రోజు దేవాలయం వద్ద చెప్పులు దొంగలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం తొలిగిపోతుందని చెబుతున్నారు.
చెప్పులను దానం చేయడం వల్ల లేదా చెప్పులను ఎవరైనా తీసుకోవడం వల్ల శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు దూరమైపోతాయని చెబుతున్నారు.శని గ్రహం పాదాలలో నివసిస్తుందని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.
అటువంటి పాదాలకు ధరించే చెప్పుల పైన శని( Shani ) యొక్క ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.అలాగే జాతకంలో శని దృష్టి ఒకరి పై ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు.
అలాంటప్పుడు దేవాలయాల వద్ద చెప్పులు ఎవరైనా చోరీ చేస్తే లేదా మనమే చెప్పులు వదిలేస్తే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయని,అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL