అనుష్క శెట్టి( Anushka Shetty ), నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.( Miss Shetty Mr Polishetty ).
ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయి బాగా మెప్పించడమే కాకుండా మరిన్ని పాజిటివ్ వైబ్స్ కలిగించింది.

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అనుష్క బాహుబలి సిరీస్ తర్వాత అంతగా నటించిన సినిమాలు లేవనే చెప్పాలి.అనుష్క లాస్ట్ నటించిన మూవీ నిశ్శబ్దం ( Nishabdam ).ఇది అంతగా ఆకట్టుకోలేక పోయింది.మరి లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.మరి మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తే కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాదు.
చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటున్న ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.







