ఆంధ్రప్రదేశ్లో మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) జరగనున్నాయి.ఇప్పటికే ఎన్నికల తాలూకు జోష్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.
మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రచారానికి తెర తీసాయి .ప్రతిపక్షాలు అధికారపక్ష వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంటే, అధికార పార్టీ తమ సంక్షేమ పథకాల ఫలితాలు తమను గెలిపిస్తాయి అనే ధీమా ను వ్యక్తం చేస్తుంది.అయితే గత ఎన్నికల్లో 151 సీట్లతో బంపర్ విక్టరీ సాధించిన వైసీపీకి( YCP ) గ్రౌండ్ లెవెల్ లో ఇప్పుడు సీన్ మారుతుంది అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.151 సీట్లు గెలిచిన పార్టీకి ఉండాల్సిన స్థాయిలో ప్రజాధరణ ఇప్పుడు గ్రౌండ్లో కనిపించడం లేదని దానికి కారణం పార్టీ కోసం కష్టపడి ప్రాణం పెట్టిన కార్యకర్తలను ఆర్థికంగా పట్టించుకోకపోవడమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి
సాధారణంగా ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకం కూడా పూర్తిగా ప్రజలకు అందదు.అందులో కొంత శాతం స్థానిక నాయకులు వారిని నమ్ముకున్న కార్యకర్తలకు పోగా మిగిలినది ప్రజలకు దక్కుతుంది.రాజకీయాల్లో పారదర్శకత గురించి ఎంత మాట్లాడకున్నా కూడా తమను నమ్ముకున్న వారికి న్యాయం చేయకుండా ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయలేదు .అయితే తమ పథకాలను అమలు చేయడానికి పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ మీద ఆదారపడిన ప్రభుత్వం
అందులో ఏ విధమైన రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది.దీని ద్వారా అవినీతి చాలా వరకు తగ్గినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన చాలామందికి సరైన గుర్తింపు కానీ ప్రతిఫలంగానే దక్కలేదన్న నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నదని తెలుస్తుంది .జగన్ ( CM Jagan ) ముఖ్యమంత్రి అయితే తాము అభివృద్ధి చెందుతామని ఆశించిన సగటు కార్యకర్తలకు ఈ విషయంలో నిరాశ ఎదురవుతుందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా వైసిపి టికెట్పై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా అనేక కాంట్రాక్ట్ లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ ఉండడంతో వారు ఆర్థికంగా సతమతమవుతున్నారని ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నా కూడా వారిగోడును పట్టించుకునే నాధుడే లేదని వార్తలు వస్తున్నాయి.దాంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఢీ కొట్టడానికి తగినంత సంఖ్యాబలం అధికార పార్టీ కార్యకర్తలకు లేకుండా పోతుందని సోషల్ మీడియాలో కూడా వైసిపి సందడి తక్కువగానే కనిపిస్తున్నదని వార్తలు వస్తున్నాయి.అధిష్టానం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రేపు బూత్ లెవెల్ ఓటింగ్కు కార్యకర్తల దొరకని పరిస్థితి వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి
.