మరో తెలుగు సినిమాలో గెస్ట్‌ గా సల్మాన్ ఖాన్‌

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్‌ ( salman khan ) ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )నటించిన గాడ్ ఫాదర్ సినిమా లో నటించి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెల్సిందే.ఒక తెలుగు సినిమా లో సల్మాన్‌ ఖాన్ ను చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.

 Salman Khan In One More Mega Movie For Next Year , Salman Khan, Bollywood, Chir-TeluguStop.com

సిని గాడ్ ఫాదర్ మా కు సల్మాన్ ఖాన్ నటించడం వల్ల మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు.సల్మాన్ ఖాన్‌ ప్రస్తుతం హిందీ లో వరుస సినిమా లు చేసేందుకు బిజీ బిజీగా డేట్లు ఇచ్చాడు.

Telugu Bigg Boss, Bollywood, Chiranjeevi, God, Salman Khan, Telugu, Tollywood-Mo

మరో వైపు బిగ్ బాస్ ( Bigg Boss )తో కూడా సల్మాన్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే.ఇంత బిజీగా ఉన్నా కూడా సల్మాన్ ఖాన్ తెలుగు లో మరో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈసారి కూడా మెగా హీరో సినిమా లో నటించేందుకు ఓకే చెప్పాడట.ఆ మెగా హీరో ఎవరు.ఆ మెగా హీరో సినిమా ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.సల్మాన్‌ ఖాన్ డేట్లు అయితే ఇచ్చాడు… అయితే ఆయన వచ్చి షూట్‌ లో పాల్గొనే వరకు కూడా అనుమానంగానే ఉందట.

అందుకే ఇప్పుడే ప్రకటించవద్దని భావిస్తున్నారట.

Telugu Bigg Boss, Bollywood, Chiranjeevi, God, Salman Khan, Telugu, Tollywood-Mo

సల్మాన్ ఖాన్‌ యొక్క పాత్ర గురించి రివీల్‌ చేయడం పై ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తి చూపడం లేదు.సల్మాన్ ఖాన్ కు సరైన పాత్ర అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.మొత్తానికి సల్మాన్ ఖాన్ యొక్క సినిమా షూటింగ్‌ లను కూడా పక్కన పెట్టి తెలుగు సినిమా షూటింగ్ లో మూడు నుండి అయిదు రోజుల పాటు పాల్గొనేందుకు ఓకే చెప్పాడట.

గాడ్ ఫాదర్‌ సినిమా లో నటించినందుకు గాను సల్మాన్ ఖాన్ పారితోషికం తీసుకోలేదు.కానీ సల్మాన్‌ ఖాన్‌ ఈసారి మెగా మూవీ లో నటించబోతున్నందుకు గాను దాదాపుగా రోజుకు కోటిన్నర రూపాయల పారితోషికం ను అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సినిమా లో సల్మాన్ ఉంటే కచ్చితంగా వర్త్ అంటున్నారు.అందుకే సల్మాన్‌ ఖాన్‌ ను నటింపజేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయమై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube