ఖమ్మం జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పర్యటించనున్నారు.ఇవాళ మధ్యాహ్నం జిల్లాకు వెళ్లనున్న ఆయన ఖమ్మంలో సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
జూలై 2వ తేదీన ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాణిక్ రావు ఠాక్రే పరిశీలించనున్నారు.
కాగా సభా వేదికపై మాజీ ఎంపీ పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఇతర ముఖ్యనేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.