తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి ( Priyamani )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ప్రియమణి.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత సినిమాలకు దూరమైంది ప్రియమణి.
ఇక బుల్లితెరపై బాషతో సంబంధం లేకుండా ఎన్నో షోలకు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా తెలుగులో ఢీ షో తో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది ప్రియమణి.
మొన్నటి వరకు కూడా బుల్లితెర పై జడ్జిగా వ్యవహరిస్తూ అలరించిన ప్రియమణి ప్రస్తుతం సినిమాలు,వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
ఇటీవలె నాగచైతన్య( Naga Chaitanya ) నటించిన కస్టడీ సినిమాలో సీఎంగా నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పెళ్లి సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పుకొచ్చింది.ఇంటర్వ్యూలో భాగంగా ప్రియమణి మాట్లాడుతూ.
నేను సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్స్ ని పెద్దగా పట్టించుకోను.ఇప్పటికి కూడా బాడీ షేమింగ్, శరీర రంగు విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి.
అలాగే నా భర్త ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంది అని తెలిపింది ప్రియమణి.
ముస్తఫాతో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియా( Social media ) వేదికగా పంచుకున్నప్పుడు.నువ్వు ఎందుకు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అంటూ చాలామంది అభ్యంతరకరంగా దూషించారు.హేళన కూడా చేశారు.
నా గురించి అలా కామెంట్ చేసేవాళ్లందరికి నేను చెప్పేది ఒక్కటే, ఇది నా జీవితం, ఎవరితో జీవితాన్ని కొనసాగించాలనేది పూర్తిగా నా ఇష్టం అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది ప్రియమణి.అలాగే మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా కూడా నేను బాధపడను అని చెప్పుకొచ్చింది ప్రియమణి.