నిరుద్యోగ భృతి ఏ దేశ ప్రజలకు అవసరం లేదు.ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు… ఎక్కడ చూసినా నేడు నిరుద్యోగ సమస్య( Unemployment ) అనేది తారాస్థాయికి చేరిపోతోంది.
అభివృద్ధి చెందిన పెద్దన్న అమెరికాలో( America ) కూడా ఏటా నిరుద్యోగ సమస్య తారాస్థాయిలో పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి.అవును, దాంతో అక్కడ ప్రభుత్వం పెద్దమొత్తంలోనే నిరుద్యోగ భృతి ప్రయోజనాలను కల్పిస్తుంది.
నిర్ధిష్ట కాలపరిమితి వరకు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలుస్తుంది.దీంతో ఉద్యోగం ఊడిన వారంతా నిరుద్యోగ ప్రయోజనాల కోసం అక్కడ దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఈ సంఖ్య ప్రస్తుతం 2,62,00కి చేరగా గతేడాది నవంబరు తర్వాత భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇదే అత్యధికం అని చెబుతున్నారు.
ఇకపోతే, అమెరికాలో నియామకాలపరంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ… నిరుద్యోగ దరఖాస్తులు( Unemployment applications ) దారుణంగా పెరుగుతున్నాయి.గత 6 వారాల్లో వరుసగా 5 వారాలు దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించడం గమనార్హం.2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది.ఇక దాని బట్టి అర్ధం చేసుకోవచ్చు.అక్కడ ఆర్థికమాంద్యం ఏం స్థాయిలో ఇబ్బందిపెడుతోందో అని.
ఇక యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి 3 నెలలు స్థిరంగా ఉంటే మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించడం విశేషం.దాంతో కోవిడ్ సమయంలో అమెరికన్లు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఏది ఏమైనా నిరుద్యోగ భృతి విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే మాత్రం అక్కడి ప్రభుత్వం కాస్త ఎక్కువగా ఇస్తోందని కూడా తెలుస్తోంది.అది సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది.