విభిన్న చిత్రాల దర్శకుడుగా పేరు దక్కించుకున్న గౌతం వాసుదేవ్ మీనన్( Gautham Vasudev Menon ) వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.గతంలో తాను దర్శకత్వం వహించిన సినిమా ల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇప్పుడు ఫుల్ లెన్త్ పాత్రల్లో, సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ముఖ్యంగా ఈయన విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు.ఆయనకు బాగా సూట్ అవుతున్న విలన్ పాత్రలను దర్శక నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారు.
తమిళం లో వరుసగా మూడు నాలుగు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన ఈ దర్శకుడు ముందు ముందు టాలీవుడ్ లో కూడా విలన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.దర్శకుడిగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ వేషాలు వేసేందుకు గౌతమ్ మీనన్ ఆసక్తి చూపిస్తున్నాడు అంటూ తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
విలన్ గా నటించేందుకు భారీ మొత్తంలో ఈయన పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.అయినా కూడా ఆయన తో సినిమా చేసేందుకు ఎక్కువ శాతం మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ మధ్య కాలంలో సౌత్ విలన్ లకు ఎక్కువగా డిమాండ్ ఉంది.కనుక గౌతమ్ మీనన్ కెరీయర్ ని కాస్త ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే విధంగా రికార్డు సాధించే అవకాశం ఉంటుంది అంటూ సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్( Bollywood ) నుండి విలన్స్ ని తీసుకొచ్చే వారు.ఇప్పటికి కూడా స్టార్ హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల కొరకు విధంగా బాలీవుడ్ స్టార్స్ వస్తున్నారు.
అయితే సౌత్ నుండి కూడా ఎక్కువ సంఖ్యలో విలన్స్ వస్తున్న నేపద్యంలో గౌతమ్ మీనన్ కి కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన గౌతమ్ కి విలన్ గా నటించాల్సిన అవసరమేంటి అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆయన విలన్ గా నటించవద్దని డిమాండ్ చేస్తున్నారు.మొత్తానికి గౌతమ్ మీనన్ విలన్ గా దూసుకు పోతున్నాడు.