తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా చేతి వృత్తుల వారికి ల‌క్ష ఆర్థిక సాయం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం( Telanagana ) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే.విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.

 One Lakh Financial Assistance To The Handicraftsmen In Telangana Decade Celebrat-TeluguStop.com

లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది.ఇందుకు పవిధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల కులవృత్తులు, చేతివృత్తుల‌కు రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందించే ప్ర‌క్రియ మొద‌లైంది.ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్( Gangula Kamalakar ) ప్రారంభించారు.https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌ల‌తో స‌ర‌ళ‌మైన అప్లికేష‌న్‌ను రూపొందించారు.ఈ వెబ్‌సైట్ ద్వారా త‌క్ష‌ణ‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది.

కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని జూన్ 9వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) మంచిర్యాల జిల్లాలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

అదే రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల‌చే ల‌బ్దిదారుల‌కు రూ.ల‌క్ష పంపిణీ చేయ‌నున్నారు.ధరఖాస్తులకు ఎవరు అర్హులు కేవలం చేతివృత్తిపై ఆధారపడిన వారు, 18 నుండి 55 సం,,లు మద్యన వారు అర్హులు.గతంలో ప్రభుత్వ ఋణాలు తీసుకున్నవారు ఇప్పుడు ధరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

ధరఖాస్తు చేసుకోవడానికి కావల్సినవి,

1).పాస్‌పోర్టు సైజ్‌ఫోటో 2).ఆధార్ కార్డు జిరాక్స్‌ 3).కులం సర్టిఫికెట్ జిరాక్స్‌ 4).ఆదాయం సర్టిఫికెట్ జిరాక్స్‌ 5).స్టడీ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ 6).

ఫుడ్ సెక్యూరిటీ కార్డు జిరాక్స్‌ 7).బ్యాంక్ అకౌంట్ బుక్కు జిరాక్స్‌ 8).

బ్యాంక్ అకౌంట్ నెంబర్, 9).ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్, 10).పాన్ కార్డు జిరాక్స్,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube