ఇండ్ల స్థలాలు కోసం 19న జరిగే ధర్నాను జయప్రదం చేయండి: సిపిఎం పార్టీ పిలుపు

ఖమ్మం( Khammam ) నియోజకవర్గంలో అర్హత కలిగిన వారికి వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఖాళీ స్థలం వుండి ఇల్లు కట్టుకొనే వారికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 సోమవారం నాడు ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని CPM ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు( Nunna Nageswara Rao ) విజ్ఞప్తి చేశారు .

గురువారం సుందరయ్య భవనంలో జరిగిన CPM పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేవలం రెండు వేల ఒక వంద డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రమే లబ్దిదారులకు అందించారు అని, ఇంకా అర్హత కలిగిన వారు ఖమ్మం నియోజకవర్గంలో వేలాది మంది పేదలు వున్నారని తెలిపారు.పలు సందర్భాల్లో CPM పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలు కోసం పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే సొంత స్థలం కలిగిన వారికి 3 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ పెండింగ్ లో వుంది అని, గృహ నిర్మాణం రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ ఇళ్లు సమస్యలపై సోమవారం జరిగే ధర్నాలో పేదలు పాల్గొని ధర్నా( Dharna)ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, మచ్చా సూర్యం, భుక్యా ఉపేంద్ర, ch భద్రం, నకరేకంటి కుమారి, శెట్టి రవీంద్ర, పామర్తి వాసు , మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వేపాకు, కరివేపాకు రెండింటినీ ఇలా తలకు రాశారంటే చుండ్రు ఒక్క దెబ్బతో పరారవుతుంది!

Latest Khammam News