తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రణాళికబద్ధ కార్యాచరణ చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.

 District Collector V.p. Gautham Wants To Make Telangana Incarnation Decade Celeb-TeluguStop.com

గౌతమ్( District Collector V.P.Gautham ) అన్నారు.శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, అదే స్ఫూర్తిని తెలంగాణ ( Telangana )సాధన అనంతరం సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.జూన్ 2వ తేది నుండి 22వ తేది వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని అన్నారు.

జూన్ 3వ తేదిన (నేడు) నిర్వహించనున్న తెలంగాణ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కార్యక్రమంలో ఎక్కువ మంది రైతులు పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రైతు వేదికలను మామిడి తోరణాలు, పూలు, సీరియల్ బల్బులతో అందంగా తీర్చిదిద్దాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.

ట్రాక్టర్లు, ఎండ్లబండ్ల ద్వారా ర్యాలిగా రైతువేదికలకు చేరుకునేలా చూడాలన్నారు.రైతులకు దశాబ్ది ఉత్సవాలతో పాటు అందిస్తున్న పథకాలను గురించి, ముందస్తు సాగు, పంట మార్పిడి ప్రయోజనాల గురించి వివరించాలని తెలిపారు.

సర్పంచులు, ప్రత్యేకాధికారులు, పంచాయితి కార్యదర్శులు వహించి కార్యక్రమాలను విజయవంతం చేసేలా చూడాలని, కార్యక్రమానికి వచ్చే రైతులందరికి బోజనం ఏర్పాటు చేయాలని తెలిపారు.ప్రముఖులు పాల్గొనే కార్యక్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

కార్యక్రమాల ఏర్పాట్లపై ముందస్తుగా నివేదికలు పొందాలని, ప్రతి రోజు కార్యక్రమ నిర్వహణపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో ఆర్.శిరీష, సిపిఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube