ఖమ్మం నగరంలోని రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప లకు చెందిన ఖాళీ స్థలాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంత మేర స్థలం ఉంది, ఎంత మేర బఫర్ జోన్ క్రింద కేటాయించాలని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.
భూమి సేకరణ రికార్డులు సమర్పించాలని హౌజింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఖాళీ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వేలం ద్వారా విక్రయిస్తారన్నారు.
బఫర్ జోన్ పోను నికరంగా సుమారు 3 ఎకరాల 15 గుంటల స్థలం అందుబాటులోకి రానుందని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్ రావు, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాము, ఖమ్మం రూరల్ తహసీల్దార్ సుమ, అధికారులు తదితరులు ఉన్నారు
.