స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.కొత్త కొత్త నకిలీ యాప్స్ సృష్టించి, యూజర్ల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు.
తాజాగా దీనిపై ఫేస్ బుక్ కీలక ప్రకటన చేసింది.యూజర్ల సమాచారాన్ని దొంగిలించే దాదాపు 400 హానికరమైన యాప్‌లను గుర్తించినట్లు మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తెలిపింది.
ఈ యాప్‌లు యాపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉందని మెటా వెల్లడించింది.దీనిపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లకు సమాచారం అందించినట్లు వివరించింది.
అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.అప్రమత్తమై, వెంటనే నకిలీ యాప్స్‌ను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెటా హెచ్చరించడంతో యూజర్ల సమాచారాన్ని తస్కరించే యాప్‌లపై యాపిల్ సంస్థ దృష్టిసారించింది.
దీంతో 45 హానికరమైన యాప్‌లను తమ యాప్ స్టోర్ నుండి తొలగించినట్లు యాపిల్ తెలిపింది.మెటా నోటిఫికేషన్‌కు ముందు ఏడాది పొడవునా సమస్యాత్మకమైన ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ గుర్తించి తొలగించిందని గూగుల్ సంస్థ ప్రతినిధి తెలిపారు.
అన్ని యాప్‌లు ఇప్పుడు తీసివేయబడ్డాయని అధికార ప్రతినిధి వెల్లడించారు.ఇక ఎప్పుడైతే మెటా నుంచి ఈ ప్రకటన వచ్చిందో మార్కెట్‌లో గందరగోళం ఏర్పడింది.ఫలితంగా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో మెటా షేర్లు 3% పడిపోయాయి.యాప్‌లు ఫోటో ఎడిటర్‌లు, గేమ్‌లు, బిజినెస్ యాప్‌ల వలె నకిలీ యాప్‌లు ఉన్నాయని మెటా తెలిపింది.

ఇలాంటి ఫీచర్లను అందించే అనేక చట్టబద్ధమైన యాప్‌లు ఉన్నాయని, ఈ యాప్‌లు జనాదరణ పొందినవని సైబర్ నేరగాళ్లకు తెలుసని మెటా వెల్లడించింది.యూజర్లను మోసగించడానికి, వారి ఖాతాలు, సమాచారాన్ని దొంగిలించడానికి వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తారని కంపెనీ పేర్కొంది.వినియోగదారు నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వారి యూజర్‌నేమ్‌లు మరియు పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఫేస్‌బుక్‌తో లాగిన్ అవ్వమని యాప్ వినియోగదారులను అడుగుతుంది.సమాచారం దొంగిలించబడినట్లయితే, ప్రైవేట్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేయగలరని మెటా తెలిపింది.
ఫేస్‌బుక్ లాగిన్, పాస్‌వర్డ్ అందించకుండా పని చేయని ఏదైనా యాప్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కంపెనీ తెలిపింది.







