హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు అవమానం జరిగింది.చండీగఢ్‌లో నిర్వహించిన ఎయిర్ షోకు రాష్ట్రపతి ద్రౌపది ముుర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారి బన్వరీలాల్ పురోహిత్ రాష్ట్రపతి పక్క సీట్లో కూర్చున్నారు.రాష్ట్ర గవర్నర్‌ను మాత్రం రెండు సీట్ల తర్వాత కూర్చోబెట్టారు.
దీంతో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది.ఈ నేపథ్యంలో తమ గవర్నర్ కు అవమానం జరిగిందంటూ హర్యానా సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది.
ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ షో నిర్వాహకులు హర్యానా రాజ్ భవన్ సిబ్బంది పొరపాటు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.







