బహుజన నాయకుడు , అభ్యుదయవాది , నిఖార్సైన అంబేద్కర్ రిస్ట్ , తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు దళితరత్న అవార్డు గ్రహీత గుంతేటి వీరభద్రం నీ ప్రజా సంఘాల నాయకులు శాలువాలతో , మెమోంటో , పూల దండలతో ఘనంగా సన్మానించి అభినందించారు .ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా , బలపాల గ్రామంలో జన్మించి చిన్ననాటి నుండి అన్యాయాన్ని , అంటరానితనాన్ని , ముఖ్యంగా దళితులపై జరిగిన దాడులను తిప్పికొట్టి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి అని , వివాహం అయిన తర్వాత ఖమ్మం జిల్లాకు వచ్చి కొందరు నాయకుల ప్రేరేపణ వల్ల అంబేద్కరిజాన్ని భుజాన వేసుకుని శక్తివంచన లేకుండా తన సొంత ఖర్చులతో బహుజన ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఏకైక వ్యక్తి మరియు మహనీయుడు , ఆదర్శవంతుడు , గొప్ప మానవతావాది మన గుంతేటి వీరభద్రం అని కొనియాడారు .
ఆయనకు దళితరత్న అవార్డు రావడం ప్రజాసంఘాలకు హర్షణీయమని అలాగే తను చేసిన సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రకటించిన దళితరత్న అవార్డు చాలా చిన్నదని అన్నారు .భవిష్యత్ తరాలకు ఆయన మార్గదర్శిగా ఉండాలని సూచించారు .యువత వీరభద్రాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యం కోసం పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి కృష్ణారావు , ములక సురేష్ , పద్మాచారి , లిక్కి కృష్ణారావు , సత్యనారాయణ , రవీందర్ , భాసాటి హన్మంతరావు , రవి చంద్ర చౌహాన్ , కిషన్ నాయక్ , చైతన్య , కొరిపల్లి శ్రీనివాస్ , మీగడ రామారావు , పాగి వెంకన్న , వల్లెపు సోమరాజు , శ్రీనివాస్ నాయక్ , మధుగౌడ్ , గంగాధర్ , తెలంగాణ శ్రీనివాస్ , అడపా ప్రవీణ్ కుమార్ , క్రాంతికార్ , పొదిల సతీష్ , జగదీష్ , రేగళ్ల నరసింహారావు , రాజేంద్ర నాయక్ , గోట్టుముక్కల శ్రీనివాస్ , ముత్తమల ప్రసాద్ , గోపాల్ , రేగళ్ల శేషు , రేపాకుల వెంకట్రావు , కామా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .