'భోళా మ్యానియా' ఫుల్ సాంగ్ కు టైం ఫిక్స్.. మాస్ బీట్ ఎప్పుడు రాబోతుందంటే?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeei ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’.( Bhola Shankar ) గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి రెండు సక్సెస్ ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలను పెట్టుకున్నారు.

 Bhola Shankar First Single Update, Bhola Shankar First Single, Bhola Shankar, Me-TeluguStop.com

అందరి అంచనాలను నిలబెట్టుకునేలా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ అఫిషియల్ గా మరో అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
‘భోళా మ్యానియా'( Bhola Mania ) అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగా బాగా ఆకట్టు కుంది.ఇక ఈ ఫుల్ సాంగ్ ను జూన్ 4న రిలీజ్ చేస్తారని ముందుగానే మేకర్స్ చెప్పారు.అయితే ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా సాంగ్ ఏ టైం కు రిలీజ్ చేస్తారో తెలిపారు.

ఈ రోజు ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ను మేకర్స్ సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు.

దీంతో మెగా ఫ్యాన్స్( Mega Fans ) ఈ పాట కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ప్రోమో తోనే అదరగొట్టిన ఈ సాంగ్ ఫుల్ లిరికల్ ఎలా ఉంటుందో సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో మెగాస్టార్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఆశ పడుతున్నారు.మరి మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ కోసం ఎలా తెరకెక్కిస్తున్నాడో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube