టీడీపీ జనసేన( Jana sena ) పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయనే సంగతి ఇప్పటికే స్పష్టమైంది.వైసీపీ విముక్త ఏపీని కోరుకుంటున్న ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి వైసీపీ పాలనకు చెక్ పెట్టాలని చూస్తున్నాయి.
వీలైతే ఈ రెండు పార్టీలతో పాటు బిజెపిని కూడా కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలనేది అధినేతల ప్లాన్.కాగా పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నా ఇరు పార్టీలు.
ప్రస్తుతం ఒక్క విషయంలో తర్జన భర్జన పడుతున్నాయట.అదే సీట్ల పంపకం.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ? జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే సత్తా చాటుతుంది ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీల శ్రేణులకు తలనొప్పిగా మారయట.
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/06/TDP-Janasena-2024-elections-tdp-elections-ap-politics-ycp-ys-jagan.jpg)
175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో టీడీపీ జనసేన ( TDP )పార్టీలకు సమాన రీతిలో సీట్ల పంపకలు జరిగితే.సరైన ఫలితలు రావనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.ఉత్తరాంధ్రలో జనసేనకు కొంత పట్టు ఉంది.
కాబట్టి ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజిక వర్గాలలో పూర్తి స్థాయిలో జనసేనకు ( Jana sena )సీట్లు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ఇక రాయలసీమలో వైసీపీ తరువాత టీడీపీ హవా గట్టిగా ఉంటుంది.కాబట్టి ఇక్కడ జనసేనకు సీట్లు తగ్గించి టీడీపీకి అధిక సీట్లు కేటాయించాలనేది టీడీపీ కార్యకర్తల అభిప్రాయం.
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/06/2024-elections-tdp-elections-ap-politics-ycp-ys-jagan.jpg)
అయితే ఎన్ని ష్టానల్లో టీడీపీ జనసేన పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం.కాగా సీట్ల విషయం ఒక్కటే కాదు.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా ఇరు పార్టీలను వేదిస్తున్న సమస్య.
పదవులు తాను ఆశించను అని పదవే తనవద్దకు రావాలని చెబుతున్నా పవన్ సిఎం సీటుపై గట్టిగానే కన్నెశారు.అటు బాబు కూడా ఈసారి చివరి ఎన్నికలు కావడంతో సిఎం గా రిటైర్ అవ్వాలనేది చంద్రబాబు( Chandrababu Naidu ) ఆలోచనగా తెలుస్తోంది.
దీంతో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నర సంవత్సరాలు సిఎం లు గా కొనసాగే అవకాశం లేకపోలేదు.పొట్టనికి టీడీపీ జనసేన మద్య పొత్తు కన్ఫర్మ్ అయిన తరువాత అసలు సమస్య మొదలైంది.
మరి సీట్ల కేటాయింపులోనూ సిఎం అభ్యర్థి విషయంలోనూ, పవన్ చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.